ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘సాలార్’ (Salaar) సినిమా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదల ఎందుకు ఆలస్యమైందనే దానిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు.. ఇంతకీ కారణం ఏంటో తెలుసా, తాజా సమాచారం ప్రకారం గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం వల్లే ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్ విషయంలో విస్తృతమైన పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమైనట్లు కనిపిస్తోంది.
సాధారణంగా, గ్రాఫిక్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్‌తో సహా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ రిలీజ్ డేట్ కంటే చాలా ముందుగానే పూర్తి చేయాలి. ఎందుకంటే మళ్లీ అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే విడుదలకు ముందే చేయాలి కాబట్టి ఈ గ్రాఫిక్ వర్క్ అంతా కూడా నెలల ముందే జరిగిపోతుంది.
అయితే ఇప్పుడు ఈ ‘సాలార్’ సినిమాకి వస్తున్న ఈ గ్రాఫిక్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. గ్రాఫిక్ టీమ్ నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ ఈ నెల 15 నాటికి పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. అయితే ఇంకా కరెక్షన్స్ అవసరమైతే రిలీజ్ వాయిదా వేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఈ సినిమా లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీయా రెడ్డి, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కూడా నటిస్తున్నారు.
అలాగే ఒకసారి వాయిదా పడిన తర్వాత మళ్లీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలంటే అది హిందీ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి హిందీ మార్కెట్ కూడా ప్లస్ కావడంతో హిందీ డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రానికి నిర్మాతలు.
also read :
Prabhas : ప్రభాస్ కొత్త ఫామ్ హౌస్ కి సంబంధించిన ఈ విషయాలు మీకు తెలుసా ?