వేసవి కాలంలో చాలా మంది ఫ్రూట్స్ (fruits) ను అధికంగా తీసుకుంటూ ఉంటారు. వాటర్ కంటెంట్ బాగా ఉన్న పండ్లను తింటుంటారు. అయితే, కొందరు వాటర్ మిలన్, పచ్చి మామిడి కాయ, కీర దోస, జామకాయ, లాంటి ఫ్రూట్స్ తినేటప్పుడు వాటిలో ఉప్పు, కారం వేసుకొని తింటుంటారు. ఇలా ఉప్పు కారం కలిపి తినడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.నిజానికి ఇలా ఉప్పు కారం వేసుకొని తినడం వల్ల వాటి రుచి చాలా బాగుంటుంది.
అందుకే చాలా మంది ఇలా చేస్తుంటారు. కాస్త స్పైసీగా మరికొంచెం తియ్యగా ఉంటాయి. పండ్లపై చల్లిన ఉప్పు, చాట్ మసాలా లేదా చక్కెర శరీరానికి అవసరం ఉండదు. ఎక్కువ చక్కెరను కలపడం వల్ల రోజువారీ కేలరీల సంఖ్య పెరిగిపోతుంది.రోజులో తీసుకోవాల్సిన దాని కంటే అధిక కేలరీలు తీసుకున్నట్టు లెక్క. దీంతో బరువు అధికంగా పెరుగుతారు.
ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా పండ్లలో ఉండే పోషకాలు ఉప్పు, కారం, మసాలా చల్లడం వల్ల నశిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు మాదిరిగా కాకుండా అదొక చిరుతిండిలా మారిపోతుందని, పండ్లలోని అవసరమైన విటమిన్లు, ఖనిజాలను ఇవి బయటకి పంపించేస్తాయంటున్నారు.
ఉప్పు లేకుండా పండ్లు తినడం వల్ల తక్కువగా నీరు బయటకి వస్తుంది. అందువల్ల అందులోని పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పండ్లకు మరింత రుచిని ఇవ్వాలని అనుకుంటే పండ్ల మీద యాలకులు, మిరియాలు వేసుకుని తినొచ్చు.
also read :
Janhvi kapoor hot photoshoot for Filmfare Awards 2023
Viral Video : ఆకాశంలో వింత వస్తువు.. పైలెట్‌కు ఎగురుతూ కనిపించిన ఆకారం..