ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం (Surya Namaskar) చేయడం చాలా మంచిది. సూర్య నమస్కారం చేయడం వల్ల సూర్యుడి యొక్క కటాక్షం మన శరీరంపై ఉంటుందని, శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయని చాలామంది నమ్ముతారు.సూర్య నమస్కారం మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుందని, ఆరోగ్యాన్ని కాపాడుతుందని విశ్వసిస్తారు.
వ్యాధులు నివారించే యోగాసనాలలో సూర్య నమస్కారం ఒకటి
అయితే కొంతమంది సూర్య నమస్కారం అస్సలే చేయకూడదు. కొన్ని వ్యాధులతో బాధపడేవారు సూర్య నమస్కారం చేస్తే వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాచీన కాలం నుండి మనదేశంలో యోగ సాధన ఉంది. అనేక యోగాసనాలు మన వ్యాధులను నివారించడంలో సహాయ పడతాయని యోగా నిపుణులు చెబుతారు. అలాంటి యోగాలలో సూర్య నమస్కారం ఒకటి .
సూర్య నమస్కారంతో ప్రయోజనాలివే
12 యోగాసనాలను కలిపి సూర్య నమస్కారాన్ని తయారు చేశారు. దీనిని ప్రతిరోజు సాధన చేయడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సూర్య నమస్కారం యొక్క ప్రతి ఆసనానికి భిన్నమైన ప్రాముఖ్యత ఉంటుంది. సూర్య నమస్కారాన్ని ప్రతిరోజు ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. శరీరం హైడ్రేట్ అవుతుంది.
ఈ అనారోగ్య సమస్యలు ఉన్న వారు సూర్య నమస్కారం చెయ్యకూడదు
అయితే కొంతమంది సూర్య నమస్కారానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సూర్య నమస్కారం చేయకూడదు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు సూర్య నమస్కారము చేయకూడదని యోగా నిపుణులు చెబుతున్నారు. హెర్నియా సమస్య ఉన్నవారు కూడా సూర్య నమస్కారానికి దూరంగా ఉండాలి.
వెన్ను నొప్పి, ఆర్థరైటిస్ ఉన్నవారు సూర్య నమస్కారం చెయ్యరాదు
విపరీతమైన వెన్నునొప్పి లేదా నడుమునొప్పి సమస్యతో బాధపడుతుంటే సూర్య నమస్కారం చెయ్యాలని భావిస్తే ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. ఆర్థరైటిస్ సమస్యతో లేదా మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు సూర్య నమస్కారం చేస్తే మంచిది కాదు. వీరు కూడా సూర్య నమస్కరం చేయాలంటే యోగా గురువుల సలహాలు తీసుకోవాలి.
గర్భిణీ స్త్రీలు సూర్య నమస్కారం చెయ్యరాదు
తీవ్రంగా మణికట్టుకు గాయం ఉన్నప్పటికీ సూర్య నమస్కారం చేయకూడదు. అంతేకాదు గర్భిణీ స్త్రీలు సూర్య నమస్కారం చేయకూడదు. సూర్య నమస్కారం కారణంగా గర్భిణీ స్త్రీలకు కడుపు మరియు వెన్నుపైన ఒత్తిడి కలుగుతుంది. కాబట్టి వీరు కూడా సూర్య నమస్కారానికి దూరంగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది.