Dhanush: కోలీవుడ్ క్యూట్ కపుల్ ధనుష్- ఐశ్వర్య ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వారి విడాకుల వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే వారు మళ్లీ కలవబోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. డైవర్స్ ని రద్దు చేసుకుని మళ్లీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్టు గత అక్టోబర్‌లో వార్తలు రాగా, అభిమానులు ఖుష్ అయ్యారు. కానీ ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు విడిపోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
చెన్నైలోని సిటీ సివిల్ కోర్ట్ కి ఈ ఇద్దరు విడాకుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారని, ధనుష్ మరో అమ్మాయి కోసం ఐశ్వర్య రజనీకాంత్ తో విడిపోవాలనుకుంటున్నట్టు ఒవర్సీస్ క్రిటిక్ ఉమైర్ సంధు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌తో ఉమైర్‌ని ఇష్టమొచ్చిన బూతులతో నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. ఉమైర్ ట్వీట్‌తో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లకు సంబంధించిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. అయితే అభిమానులు కొన్నాళ్లుగా ధనుష్, ఐశ్వర్య తిరిగి కలవాలని కోరుకుంటున్నారు. ఇక ధనుష్ ఇటీవల సార్ సినిమాతో మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.
also read :
Viral Video : ఫూటుగా తాగి మండపంలోనే నిద్రపోయిన పెళ్లికొడుకు..
MLC Kavitha : ఓ మహిళను ఈడీ కార్యాలయానికి ఎలా పిలుస్తారు? సుప్రీంలో కవిత పిటిషన్!