Cyclone Mocha : తెలుగు రాష్ట్రాలను మోచా తుపాన్ వణికిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై మోచా తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ విభాగం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ నగర పరిధిలో కూడా వానలు విస్తారంగా కురుస్తాయని తెలిపారు. జిల్లాల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరి అయితేనే ఇళ్లలోంచి బయటకు రావాలని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
శనివారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈనెల 8వ తేదీన అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణించి మధ్య బంగాళాఖాతం వైపు కదులుతుందని, తుపాను మరింత బలపడుతుందని అంచనా వేశారు. దీనికి మోచా అనే పేరు పెట్టారు. దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. శనివారం నల్గొండలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
మరోవైపు హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే చాన్స్ ఉంది. ఇక ఏపీలో వాతావరణం విషయానికి వస్తే.. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా పశ్చిమ భాగాల్లో భారీ పిడుగులు, వర్షాలు ఇప్పటికే మొదలయ్యాయి.
కర్నూలుతో పాటు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోకి వర్షాలు వ్యాపిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక విజయవాడకు చాలా దగ్గరగా వర్షాలు వచ్చి బలహీన పడ్డాయని, ఈ ప్రాంతంలో కాస్త తక్కువే వర్షాలు నమోదవుతాయని వాతావరణ నిపుణుడు ఏపీ వెదర్‌మ్యాన్ పేర్కొన్నారు. వేసవి కాలం కాబట్టి అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురుస్తాయని, అవి కూడా వేగంగా పడతాయని ఆయన తెలిపారు.
Amit Shah : బీజేపీ శ్రేణులపై అమిత్ షా ఆగ్రహం.. బైకులు తప్ప జనాలెక్కడ?