Homeviral newsViral Video: పేరెంట్స్ క్యూట్ గిఫ్ట్‌.. చిన్నారి ఎక్స్‌ప్రెష‌న్స్ అదిరిపోయాయిగా..!

Viral Video: పేరెంట్స్ క్యూట్ గిఫ్ట్‌.. చిన్నారి ఎక్స్‌ప్రెష‌న్స్ అదిరిపోయాయిగా..!

Telugu Flash News

Viral Video:  త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ని సంతోష పెట్టేందుకు ఎలాంటి బ‌హుమ‌తి అయిన ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే ఒక్కోసారి పిల్లలు కొన్ని గిఫ్ట్స్ చూసి చాలా మురిసిపోతుంటారు.

ఇంటర్నెట్ యుగంలో తల్లిదండ్రుల వల్ల సంతోషం వ్యక్తంచేసిన పిల్లల వీడియోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒక‌టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఓ తండ్రి తన కూతురుకు బొమ్మ కుక్కను గిఫ్టుగా ఇచ్చాడు. అదిచూసి సంతోషం వ్య‌క్తం చేసింది.

ఆ త‌ర్వాత నిజంగా కుక్క పిల్ల‌నే ఇచ్చారు. దీంతో ఆ చిన్నారి ఆ కుక్క పిల్ల చూసి ఎమోష‌న‌ల్ అవుతూ క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చింది.

ఎక్స్‌ప్రెష‌న్స్ అదుర్స్..

ఈ చిన్నారి ఎమోషనల్ అయిన వీడియోని చిన్నారి బ్రెన్నా తల్లి ప్యూబిటీ మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, తర్వాత తన అఫీషియల్ ఇన్‌స్టా పేజీలో చేరింది.

మొదట కుక్క బొమ్మను గిఫ్టుగా ఇచ్చినపుడు తనకు రియల్ పప్పీని గిఫ్టుగా ఇస్తాడని బ్రెన్నా అస్స‌లు ఊహించ‌లేద‌ట‌.అయితే రియ‌ల్ కుక్క గిఫ్ట్‌గా అందుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని అంటుంది బ్రెన్నా. బ్రెన్నా ఆనందం చెందిన ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరూ చూసి ఆనందప‌డుతున్నారు.

అంతేకాదు సోష‌ల్ మీడియాలోను తెగ షేర్ చేస్తున్నారు. మూగ జీవాల ప‌ట్ల క‌ల్మ‌షం లేని చిన్నారి చూపించిన ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవుతున్నారు.

-Advertisement-

క్యూట్ కామెంట్స్‌కి ఆ వీడియో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఈ వీడియోకి ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చిన్నారిని చూసి తెగ మురిసిపోతున్నారు. అంతేకాదు చిన్నారిపై క్యూట్ క్యూట్ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

గ‌తంలోను ఇలాంటి వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేయ‌గా, ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. అంతేకాక ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Pubity (@pubity)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News