custody telugu movie review: ఇటీవల అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలు వరుస పరాజయాలు సాధించాయి. ఈ క్రమంలో అక్కినేని ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచేందుకు నాగ చైతన్య కస్టడీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడంతో యాక్షన్, థ్రిల్లర్ మూవీ లవర్స్ ఈ చిత్రం కోసం కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ వచ్చారు ఫ్యాన్స్. మరి నేడు విడుదలైన ఈ చిత్రం కథ ఏంటి, మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ:
శివ(నాగ చైతన్య ) నిజాయితీ గల కానిస్టేబుల్, తను ప్రేమించిన రేవతి(కృతి శెట్టి)ని వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. అయితే సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్లో రాజన్న ( అరవింద్ స్వామి) ని అరెస్ట్ చేసి ఉంచుతారు, అప్పుడు డ్యూటీ లో ఉన్న శివ కి రాజన్న ని ఎవరో చంపేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. మరోవైపు వైపు రేవతికి వేరే పెళ్లి నిశ్చయించారని తెలుస్తుంది.దీంతో శివ ఎలాగైనా న్యాయం గెలవాలని చెప్పి రాజన్నని కోర్ట్ లో అప్పగించేందుకు అదే రాత్రి, ఇటు రేవతి తో పాటు రాజాన్నని కూడా తీసుకెళ్తాడు. దీంతో శివ రాజన్నల కోసం పోలీసుల వెతుకులాట జరుగుతుంది. అయితే రాజన్నని చంపాలనుకున్నది ఎవరు, శివ పోరాటం ఫలిస్తుందా అనేది థియేటర్‌లో చూడాల్సిందే.
పర్‌ఫార్మెన్స్:
శివ పాత్రలో నాగ చైతన్య అదరగొట్టాడు. మొదట్లో కొంచెం సెట్ అవ్వనట్లు అనిపించినా, ఎప్పుడైతే కథలో లీనమయ్యామో, శివ పాత్రతో కనెక్ట్ అవ్వకుండా ఉండలేం. నాగ చైతన్య ఈ చిత్రం కోసం శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. కొన్ని సన్నివేశాల్లో చైతు లుక్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాయి. ఇక నాగ చైతన్య కి సమానంగా స్క్రీన్ టైం ఉన్న అరవింద్ స్వామి అంతే అద్భుతంగా తన పాత్రని పండించాడనే చెప్పాలి. కృతి శెట్టి గ్లామర్, శరత్ కుమార్ నటనతో పాటు మిగిలిన తారాగణం కూడా వారి పాత్రల మేరకు బాగానే చేసారు.
టెక్నికల్ విషయానికి వస్తే.. వెంకట్ ప్రభు తమిళ్ లో మంచి దర్శకుడు కాగా, ఆయన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి అనుగుణంగా, ఇటు తమిళ ప్రేక్షకులకి అనుగుణంగా అందంగా ప్రజెంట్ చేశారు. అయితే కథ, కథనం అంత బాగున్నప్పటికీ, చిత్రంలో అక్కడక్కడా తమిళ్ నేటివిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. దర్శకుడు వెంకట్ ప్రభు ఇంటర్వెల్ నుంచి కథపై కాస్త ఆసక్తి కలిగించగలిగారు కానీ.. ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకోలేదు. సినిమా మొత్తం పాటలు టైం గడపడానికి మాత్రమే పెట్టినట్లు ఉంది. కొన్నిసన్నివేశాలు కన్విన్సింగ్ గా అనిపించవు.
ప్లస్ పాయింట్స్:
నాగ చైతన్య నటన
యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
సెకండాఫ్‌లో ఔట్ డేటెడ్ సీన్స్
చివరిగా…
ప్రేమ కథ చిత్రాలకి అక్కినేని హీరోలు మారుపేరుగా నిలిచారు. అయితే మాస్ ఇమేజ్ కోసం వారు ఎంతో ప్రయత్నిస్తుండగా, నాగ చైతన్య కి కొంత మాస్ ఇమేజ్ ఆటో నగర్ సూర్య తో వచ్చింది, ఇప్పుడు ఈ కస్టడ్డి చూస్తే మంచి మాస్ ఇమేజ్ వచ్చే లాగా అయితే ఉంది. కస్టడీ కమర్షియల్ చిత్రమే అయినప్పటికీ ఒక రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా సాగలేదు. ఫస్ట్ హాఫ్ బాగా బోరింగ్ గా అనిపించడంతో ఆడియన్స్ సెకండ్ హాఫ్ లో పెద్ద మిరాకిల్ జరగాలని అనుకుంటారు. కానీ అది జరగలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కాస్త అవుట్ డేటెడ్ గా అనిపిస్తాయి. దీనితో కొన్ని ట్విస్ట్ లు ఉన్నప్పటికీ ఆసక్తి ఏర్పడదు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE