Cricketers: టెక్నాలజీ రోజు రోజుకి సరికొత్త పుంతలు తొక్కుతుంది. టెక్నాలజీ సాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇంకొందరు అభిమానులు తమ కోరికలు తీర్చుకుంటున్నారు. క్రికెటర్స్ కాని లేదంటే సినీ సెలబ్రిటీలు కాని చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా మనం ఎవరిని కావాలంటే వారిని చిన్న పిల్లలుగా మార్చి చూడొచ్చు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సంజూ శాంసన్, రిషభ్ పంత్ చిన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలని భావించిన అభిమాని ఏఐ టెక్నాలజీ సాయంతో టీమిండియా ఆటగాళ్ల చిన్న పిల్లల ఫొటోలను తయారు చేశాడు.
ధోనీ, విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలతో పాటు ఇతర ఆటగాళ్ల ఫొటోలను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గౌరవ్ అగర్వాల్(@7Gaurav8) అనే ట్విటర్ యూజర్ ఏఐ టెక్నాలజీ సాయంతో ఈ ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో ఉన్న కొన్ని తప్పిదాలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పాల బుగ్గల వయసులో క్రికెటర్లకు మీసాలు, గడ్డాలు ఉన్నాయా? అని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ తప్పిదాలను సదరు యూజర్ సవరించే ప్రయత్నం చేశాడు.
ఏఐ టెక్నాలజీకి సంబంధించిన ఫొటోలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముందుగా కొన్ని జంటలకు సంబంధించిన ఏఐ టెక్నాలజీతో కూడిన వెడ్డింగ్ ఫొటోలు వైరల్ కాగా, ఆ తర్వాత గౌరవ్ టీమిండియా ఆటగాళ్ల ఫొటోలను ఈ టెక్నాలజీతో రూపొందించి ట్వీట్ చేసాడు. వీటికి … ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాంతో అతను మహిళా క్రికెటర్ల ఫొటోలను కూడా షేర్ చేశాడు. భారత ఆటగాళ్ల ఫొటోల్లో రోహిత్ శర్మ ఫొటో చాలా ముద్దుగా ఉంది. గతంలో ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీ సాయంతో టీమిండియా ఆటగాళ్ల ఓల్డేజ్ ఫొటోలు షేర్ చేయగా… అవి కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌కి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
Sanju Samson
14/n pic.twitter.com/ZabYVKYQxf— Gaurav Agarwal (@7Gaurav8) January 4, 2023