Telugu Flash News

Corona in China: చైనాలో కరోనాతో 10 లక్షల మంది చనిపోతారట.. సంచలన నివేదిక బహిర్గతం

corona cases in china

Corona in China: ప్రపంచాన్నే గడగడలాండించిన కరోనా మహమ్మారి ఇప్పుడు చైనా దేశాన్నే నాశనం చేసేలా కనిపిస్తోంది. మొదటి కరోనా వేవ్‌లో అమెరికా తీవ్ర ప్రభావానికి గురైంది. అలాగే భారత్‌లోనూ అనేక మరణాలు సంభవించాయి. పలు దేశాల్లో మరణమృదంగా సృష్టించిన కరోనా.. చైనా దేశాన్ని ఇప్పటికీ వదల్లేదు. పలు దేశాల్లో కరోనా పూర్తిగా మాయమైపోయింది. ప్రస్తుతం చైనాలో మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆ దేశ ప్రజలను, ప్రపంచ వైద్య రంగాన్ని కలవరపెడుతోంది.

తాజాగా చైనాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో ప్రజల నుంచి నిరసన పెల్లుబికింది. గత్యంతరం లేక లాక్‌డౌన్‌ సడలించడంతో ప్రజలు వీధుల్లో తిరగడం పెరిగింది. తద్వారా కరోనా కోరలు చాచింది. వేలాది సంఖ్యలో ప్రజలు కోవిడ్‌ బారిన పడ్డారు. రోజువారీ కేసులు 30వేలకు పైగా నమోదు కావడం, వీటిలో మరణాలు కూడా పెరగడంతో మృత్యుభయంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

బీజింగ్‌లో సోమవారం కోవిడ్‌తో ఇద్దరు మృతి చెందారు. ఈ మరణాలతో కలిపి కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి మరణాల సంఖ్య 5,237కు చేరిందని చైనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, నేరుగా కరోనా సోకి మరణించిన వారినే అక్కడి ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటోంది. కరోనా అనంతర సమస్యలతో చనిపోతున్న వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. మరోవైపు కరోనా అనంతరం గుండె జబ్బులు పెరిగి, పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో చాలా మంది చనిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.

మరణాలు లక్షల్లో పెరిగే ప్రమాదం..

ఈ పరిణామాలను బట్టి చూస్తే చైనాలో కరోనాతో పెద్ద ఎత్తున ప్రజలు మరణిస్తున్నారని ఆరోగ్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో 11 లక్షల కరోనా మరణాలు సంభవించాయన్న చైనా.. ఆ దేశంతో పోల్చితే తమ దేశంలో కరోనా అదుపులోనే ఉందని చెప్పుకొచ్చింది. అయితే, చైనాలో ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న ప్రపంచ ఆరోగ్య రంగ నిపుణులు.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి కరోనా మరణాలు 3.2 లక్షలకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు అమెరికాకు చెందని ఓ సంస్థ అధ్యయనం ప్రకారం వచ్చే ఏడాది చైనాలో 10 లక్షల కోవిడ్‌ మరణాలు సంభవిస్తాయని సంచలన నివేదికను బహిర్గతం చేసింది.

also read news: 

Cristiano Ronaldo : ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో రియల్ లైఫ్ స్టోరీ .. లెక్క లేనన్ని రికార్డులు అతని సొంతం..

Rashmi Gautam Latest instagram images december 2022

 

 

Exit mobile version