HometelanganaCM KCR : మహారాష్ట్రపై ఫోకస్‌ పెంచిన సీఎం కేసీఆర్‌.. నేడు మరోసారి భారీ బహిరంగ సభ

CM KCR : మహారాష్ట్రపై ఫోకస్‌ పెంచిన సీఎం కేసీఆర్‌.. నేడు మరోసారి భారీ బహిరంగ సభ

Telugu Flash News

CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై ఆయన ఫోకస్‌ పెంచారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలకు అధ్యక్షులను సీఎం ప్రకటించారు. దాంతో పాటు ఇది వరకే మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు మరోసారి నాందేడ్‌ జిల్లాలోని ఖాందర్‌ లోహలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. ఈ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతోపాటు పలు పార్టీలకు చెందిన నేతలు కూడా బీఆర్ఎస్‌లో చేరనున్నారు.

ఈ బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ఈ సభలో కేసీఆర్ ప్రసంగంపై అందరిలో ఆసక్తి నెలకొంది. చాలా కాలం నుంచి ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ రాజకీయాలు కొనసాగిస్తున్నారు. మోదీ చర్యలపై విరుచుకుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కేసీఆర్.

ఇక తాజాగా కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆమెను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై కూడా కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉందంటున్నారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేసీఆర్ పోరాటం చేస్తున్నారు. మరోవైపు తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా కేసీఆర్ మాట్లాడే చాన్స్‌ ఉంది.

ఇప్పటికే దీన్ని కేసీఆర్ ఖండించారు. ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు. ఇక మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ, కార్యాచరణపై కేసీఆర్ కీలక ప్రసంగం చేసే అవకాశాలున్నాయి. త్వరలో నాందేడ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దింపనున్నారు కేసీఆర్. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదం ఎత్తుకున్న కేసీఆర్.. రైతుల గురించి ప్రత్యేకంగా మాట్లాడనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతోందని, ధాన్యం కొనుగోలు, మద్దతు ధర.. ఇలా అనేక అంశాలపై కేంద్రాన్ని నిలదీసే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

NTR: ఎన్టీఆర్ పిల్ల‌ల‌కు కొత్త బ‌ట్ట‌లు పంపిన స్టార్ హీరోయిన్.. ఆశ్చ‌ర్యంలో ఫ్యాన్స్

CCL 2023 : మొత్తానికి క‌ప్ కొట్టేసిన తెలుగు వారియ‌ర్స్.. ఫైన‌ల్స్‌లో భోజ్‌పురిపై విజ‌యం

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News