Telangana News : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం ఎవరో అనే అంశంపై భారీ కసరత్తు జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎంగా ఎన్నుకుంటారా? దళితుడు, సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్కకు పట్టం కడతారా? అనేది ఉత్కంఠగా ఉంది. ఈ నేపథ్యంలో గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలంతా హాజరున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్థిపై ఏకగీవ్ర తీర్మానం చేసే అవకాశం ఉంది. సీఎం అభ్యర్థి ప్రకటన తర్వాత సాయంత్రం ఎల్బీ స్థాడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు.
సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి?
సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి యువ నాయకుడు, చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధించడంలో రేవంత్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అయితే, తెలంగాణలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్న నేతలు భట్టి విక్రమార్కను సీఎం అభ్యర్థిగా చేయాలని కోరుతున్నారు. భట్టి విక్రమార్క దళిత నాయకుడు, చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
సీఎం అభ్యర్థి ప్రకటన ఎప్పుడు?
సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. సీఎం అభ్యర్థిపై ఏకగీవ్ర అభిప్రాయం ఏర్పడితే, సమావేశం ముగిసిన వెంటనే సీఎం అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉంది.