HomecinemaChiranjeevi: సుమ‌న్‌ని జైల్లో పెట్టించింది చిరునా.. అస‌లు కార‌ణం చెప్పిన మెగాస్టార్

Chiranjeevi: సుమ‌న్‌ని జైల్లో పెట్టించింది చిరునా.. అస‌లు కార‌ణం చెప్పిన మెగాస్టార్

Telugu Flash News

Chiranjeevi: ఆరు ప‌దుల వ‌య‌స్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న స్టార్ మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం వాల్తేరు వీర‌య్య‌. మూసీవ్యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి ఊర మాస్ పాత్రలో క‌నిపించి అల‌రించ‌నున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. దాదాపు 22 ఏళ్ల క్రితం చిరుతో కలిసి అన్నయ్య’ మూవీలో నటించిన మాస్ మహారాజా రవితేజ ఇన్నేళ్ల విరామం తరువాత ఈ మూవీలో కీలక అతిథి పాత్ర చేశాడు.

జనవరి 13న భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాగా, ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. సినిమా ప్రచారంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మీడియితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేయడం సీనియర్ నటుడు అలనాటి హీరో సుమన్ ఇష్యూపై ఘాటుగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఒకానొక దశలో చిరంజీవి స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో సుమన్ జైలు పాలు కావడానికి చిరంజీవే కారణం అంటూ పుకార్లు వినిపించాయి. దీనిపై తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఘాటుగా స్పందించారు. చిరుని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ‘సుమన్ బ్లూ ఫిల్మ్ కేసు’ గురించి స్పందించమని కోరడంతో ముందు చిరు నిరాకరించినా ఆ తరువాత అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

ఛీ..ఛీ..ఛీ.. ఇలాంటి వాటికి ఆన్సర్ ఇవ్వడం కూడా నాకు చాలా ఇబ్బందికరంగా వుంది. నేను సుమన్ మంచి స్నేహితులం మధ్యలో ఎవడో పోరంబోకు జర్నలిస్ట్ ఏదో రాశాడు.. పోరంబోకు అనే మాట హార్ష్ గా వుండొచ్చు కానీ వాడు ఏదో రాశాడా.. రాసిన దాన్ని వక్రీకరించాడో కానీ ఇప్పటికీ వందలసార్లు సుమన్ ఏం లేదని చెప్పాడు. ఆయనకి నాకు మ‌ధ్య‌ ఎలాంటి విరోదం లేదు. ఇప్పటికీ మేం మాట్లాడుకుంటుంటాం సుమన్ నేను 80వ దశకం బ్యాచ్ రీ యూనియన్ లో కలుస్తాం.. మాట్లాడుకుంటాం. అయితే కొంద‌రు పదే పదే ఇవే విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి వాటిపై మాట్లాడుకోవడం సిగ్గు చేటు. ఏ తప్పు చేయని వాడిపై ఆరోపణలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నా నుంచి ఎవరూ ఏ తప్పు పట్టలేరు. ఇలాంటివి సాగదీస్తూ వెళ్లినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అంటూ కొంచెం ఘాటుగానే స్పందించారు చిరంజీవి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News