టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా బాబు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని పేర్కొన్నారు. గురువారం బీజేపీ మాజీ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ గూటికి చేరారు. అమరావతి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని విడిచి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారని చంద్రబాబు తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణను సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు.. కన్నాకు పార్టీ కండువా కప్పారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేడన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. విద్యారంగంలో ఏపీ 19వ స్థానానికి పడిపోయిందని చంద్రబాబు తెలిపారు. సంక్షేమం అనేది రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయిందన్న చంద్రబాబు.. కార్పొరేషన్లన్నీ మూసేసే పరిస్థితి దాపురించిందన్నారు. గ్రామీణ వ్యవస్థను వైసీపీ నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆర్థిక ఉగ్రవాది అని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర సంపద అంతా తనవద్దే ఉండాలనుకుంటున్నారని, అందరూ బానిస జీవితం గడపాలనేది జగన్ ఉద్దేశమని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు పేదవారయ్యారని, జగన్ ధనవంతుడు అవుతూనే ఉన్నాడన్నారు. పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రుల్లో కొందరు అవినీతిపరులు, మరికొందరు అసమర్థులు ఉండేవారని చంద్రబాబు తెలిపారు.
జగన్ మాదిరి విధ్వంసం చేసిన ముఖ్యమంత్రులు చరిత్రలో లేరని చంద్రబాబు అన్నారు. జగన్‌లా వ్యవస్థలపై దాడులు ఎవరూ చేయలేదన్నారు. ఇక వైఎస్ వివేకా హత్య కేసుపై కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అని సీబీఐ అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొందని చెప్పారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లోనే హత్యకు కుట్ర పన్నినట్లు సీబీఐ పేర్కొందన్నారు. ఈ కేసులో జగన్ గూగుల్ టేక్ అవుట్‌లో అడ్డంగా దొరికారంటూ చంద్రబాబు ఆరోపించారు.
also read:
Rakul Preet Singh : షాకిచ్చిన రకుల్.. నవంబర్‌లోనే పెళ్లి అయిందంటూ ఆశ్చర్యకర కామెంట్స్
Naresh and Pavitra : నరేష్- పవిత్ర విడిపోబోతున్నారా.. ట్విస్ట్ అదిరిందిగా..!