Chandrababu Naidu arrest : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి జనసేన, సీపీఐ, లోక్‌సత్తా సహా పలు సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర సమ్మె నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రకటించాయి.
చిన్నారుల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నీతి నిజాయతీగా పేరొందిన చంద్రబాబుపై సైకో జగన్ ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసింది.
నిత్యం ప్రజల కోసం పని చేసే ఓ ప్రజా నాయకుడిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం బాధాకరమన్నారు. ఇది తెలుగు ప్రజలపైనా, ప్రజాస్వామ్య వ్యవస్థపైనా జరిగిన దాడి.. టీడీపీ అధినేత అక్రమ అరెస్టు, పార్టీల తీరుపై దుమారం, ఫ్యాక్షన్ రాజకీయాలకు నిరసనగా సోమవారం రాష్ట్ర బంద్ చేపట్టాలని నిర్ణయించాం.
ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు కోరారు. బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.
చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని జనసేన ఇప్పటికే ఖండించింది. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న అధికార పార్టీ ప్రజాకర్షక చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రజలకు అనుకూలంగా మాట్లాడే ప్రత్యర్థి పార్టీలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ వేధిస్తున్నారన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన నిరసిస్తోంది. సోమవారం జరిగే బంద్‌కు జనసేన సంఘీభావం ప్రకటించింది.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ సెక్షన్ కింద శనివారం నుంచే నిషేధాజ్ఞలు, ఆంక్షలు విధించారు. డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు అందిన ఆదేశాల మేరకు ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ ఈ సెక్షన్ అమలు చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు నిరసన తెలిపేందుకు బయటకు రాకూడదనే ఇలా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. బంద్ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. బంద్‌లో పార్టీ శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని లోకసత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఒక ప్రకటనలో కోరారు. జైభీమ్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జయకుమార్ మాట్లాడుతూ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.
also read :
Weather Report : ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉపశమనం.. రెండు రోజుల పాటు వర్షాలు