Chalaki Chanti: జబర్ధస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకి ఎంతో మంది కమెడీయన్స్ చేరువయ్యారు. అలాంటి వారిలో చలాకీ చంటి ఒకరు. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చంటి సినిమాలతో పాటు పలు టీవీ షోలకి యాంకరింగ్ కూడా చేశారు.
అయితే తనదైన పంచులతో, కామెడీతో కడుపుబ్బా నవ్వించే చలాకీ చంటి.. గత కొన్ని రోజులుగా బుల్లితెర మీద గానీ, వెండి తెర మీద గానీ కనిపించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. చలాకీ చంటి కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరగా, ప్రస్తుతం అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
అనారోగ్య సమస్య ఏంటన్నది మాత్రం క్లారిటీ లేదు. చంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అని తెలిసి ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని, సీరియస్ మేటర్ అయితే కాకూడదని ప్రార్ధిస్తున్నారు. కాగా, చంటి బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 6లో పాల్గొని చాలా మంది అభిమానులని సంపాదించుకున్నాడు.
also read :
Jabardasth : జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు!
Jabardasth | Sowmya Rao : జబర్ధస్త్ యాంకర్ ఎవరు లేని అనాథనా ? తన స్టోరీ ఏంటి ?