Homenationalheatwave : దేశ వ్యాప్తంగా మండుతున్న ఎండలు.. కేంబ్రిడ్జ్‌ వర్సిటీ కీలక నివేదిక!

heatwave : దేశ వ్యాప్తంగా మండుతున్న ఎండలు.. కేంబ్రిడ్జ్‌ వర్సిటీ కీలక నివేదిక!

Telugu Flash News

heatwave : ఇండియాలో 90 శాతం ప్రాంతాల్లో ఎండలు భగభగ మండిపోతుననాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. వడదెబ్బతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాతావరణ శాఖ ఇప్పటికే అనేక ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసింది.

మరో ఐదు రోజుల పాటు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఐఎండీ పేర్కొంది. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. వాతావరణ మార్పుల కారణంగా దేశ నలుమూలలా వడగాడ్పుల తీవ్రత పెరుగుతూ వస్తోందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.

దేశ రాజధాని ఢిల్లీలో వడగాలుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ప్రమాదకర పరిస్థితులున్నాయని నివేదిక తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ వెలువరించిన ఈ రిపోర్ట్‌లో వేడిగాలుల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రాంతాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉందని తెలిపింది.

ఈ వాతావరణ మార్పుల కారణంగా భారత్ సుస్థిరాభివృద్ధిలోని కొన్ని లక్ష్యాలను గడువులోగా సాధించలేకపోతోందని పేర్కొంది. గత 50 ఏళ్లలో భారత్‌లో వడ గాలుల కారణంగా 17 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ మాజీ సెక్రటరీ ఎమ్ రాజీవన్ తెలిపారు.

ఈ మరణాలపై 2021లో ఓ రిపోర్ట్ కూడా వచ్చింది. 1971 నుంచి 2019 మధ్య కాలంలో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి. కొద్ది రోజుల పాటు వేడిగాలుల ముప్పు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది.

also read :

-Advertisement-

Gold Rates : భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియుల హుషారు!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News