BRS MLA పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో వరుసగా మూడు రోజులుగా ఐటీ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. ఎమ్మెల్యేకు చెందిన కంపెనీలు, వాటి ఆర్థిక లావాదేవీలపై సమాచారం సేకరించారు. తన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడంపై పైళ్ల శేఖర్ రెడ్డి స్పందించారు. కుట్ర పూరితంగానే ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. తొలి రోజు గంటన్నర వ్యవధిలో ఐటీ దాడులు పూర్తికాగా.. అధికారులు మాత్రం మూడు రోజులు జాప్యం చేశారన్నారు.
‘‘నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం.. ఏళ్ల తరబడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా.. విదేశాల్లో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయనేది అవాస్తవం.. ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.. విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్లేందుకు సిద్ధం.. అనుకూల సమాచారం రాకపోవడంతో.. ఐటీ అధికారులు నిరాశతో వెనుదిరిగారు’’ అని పైళ్లశేఖర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బంధువుల వ్యాపార లావాదేవీలతో పాటు వారి ఇళ్లలో సోదాలు చేసిన ఐటీ అధికారులు.. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
read more :
anasuya hot in bikini : లేటు వయసులో ఘాటు అందాలు
Adipurush : నెగెటివ్ రివ్యూ ఇస్తున్నాడని.. ప్రభాస్ ఫ్యాన్స్ దాడి.. వీడియో వైరల్