Viral Video: సోషల్ మీడియాలో ఒక్కోసారి విచిత్ర వీడియోలు మనకు దర్శనం ఇస్తుంటాయి. వాటిని చూస్తే అవాక్కవ్వడం ఖాయం. అందుకు కారణం అందులో కనిపించే సన్నివేశాలు. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఓ వ్యక్తి కింద మీద పడి డ్యాన్స్‌లు చేశాడు. ఎగిరెగిరి జంప్‌లు చేశాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు వీడికి ఏమైందో అని నోరెళ్లపెట్టారు. వీడియో ప్రకారం… ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లిలో డీజే పెట్టారు.ఆ సమయంలో స్టేజ్ కింద కొందరు అబ్బాయిలు డాన్స్ చేస్తుండగా.. పెళ్ళికి వచ్చిన అతిథులు కుర్చీలలో కూర్చుని ఆ హంగామా చూస్తున్నారు.
భయపెట్టించేశాడుగా…
అయితే పెళ్లిలో పెట్టిన డీజే సౌండ్‌కి ఓ యువకుడు పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. ముందుగా కుర్చీపై కూర్చొని తలను అటూ ఇటూ ఊపాడు. కొన్ని సెకన్ల తర్వాత అతను తన కుర్చీపై లేచి విచిత్రమైన రీతిలో డాన్స్ చేస్తూ అందరిని భయపెట్టాడు. ముందు కుర్చీ ఉండడంతో కిందపడ్డాడు. అయినా కూడా తగ్గేదేలే అంటూ కిందపడి కూడా డాన్స్ చేశాడు. ఇది చూసిన అక్కడి వారు పడిపడి నవ్వుకోవడమే కాదు ఆశ్చర్యంలో మునిగి తేలారు. వీడికి ఏమైంది రా బాబు అంటూ ఆశ్చర్యంలో మునిగి తేలారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.
ఈ వీడియోను videonation.teb పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేయగా, ఈ వీడియోకి ‘ఇంత ఎనర్జీ తప్పనిసరి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీడియో చూసిన అందరూ యువకుడి డాన్స్ చూసి అవాక్కవుతున్నారు.. వీడియోకి 5000 కంటే ఎక్కువ లైక్‌లు రాగా, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘ఇదేందయ్యో ఇది.. ఇలాంటి డాన్స్ నేనెక్కడా చూడలే’, ‘యువకుడు మద్యం పుచ్చుకున్నాడు’ అని కొందరు కామెంట్ చేయగా, మరి కొందరు మాత్రం అతను డీజే సాంగ్‌కి ఆగలేకపోయాడు అని మరి కొందరు అంటున్నారు.
View this post on Instagram