బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) మూడో టెస్టు ఈరోజు ప్రారంభమైంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టుల్లో నెగ్గిన టీమిండియా.. జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండోర్ స్టేడియం స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు ఆదిలోనే తడబడ్డారు. ఓపెన్లు, మిడిలార్డర్ సహా భారత్ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైంది.
ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌కు అవకాశం దక్కలేదు. అతని స్థానంలో యువ బ్యాటర్ శుభమన్ గిల్‌కు చాన్స్ ఇచ్చింది మేనేజ్‌మెంట్. రోహిత్ శర్మ 12, శుభమన్ గిల్ 21 పరుగులు చేసి వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్యాటర్లంతా టపాటపా పెవిలియన్‌కు చేరడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పుజారా 1, కోహ్లీ 22, జడేజా 4, శ్రేయస్ అయ్యర్ డకౌట్, శ్రీకర్ భరత్ 17, అక్షర్ పటేల్ 12, రవిచంద్రన్ అశ్విన్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో వచ్చిన ఉమేష్ యాదవ్ రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో విరుచుకుపడ్డాడు. 13 బంతుల్లోనే 17 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా స్కోర్ 100 మార్క్ దాటింది. ఆఖరి వికెట్‌గా మహ్మద్ సిరాజ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా భారత్ 33.2 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది.
ఆసీస్ బౌలర్ కునేమన్ ఐదు వికెట్లతో భారత బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మరో సీరియర్ బౌలర్ నేథన్ లియోన్‌కు మూడు వికెట్లు దక్కాయి. టి.ముర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆచి తూచి ఆడింది. అయితే, భారత ఆల్‌రౌండర్ జడేజాకు నాలుగు వికెట్లు పడ్డాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 156 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 60 పరుగులతో రాణించాడు. మరో బ్యాటర్ లబుషేన్ 31 పరుగులు చేసి వెనుదిరిగాడు.
మొత్తానికి ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో ప్రస్తుతానికి 47 పరుగుల లీడ్ దక్కింది. భారత ఓపెనర్లు శుభారంభం ఇచ్చినా మిడిలార్డర్ రాణించకపోవడంతో కనీసం 150 పరుగుల మార్క్ కూడా చేరుకోలేకపోయింది. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్ కావడంతో భారత బ్యాటర్లు చేతులెత్తేయాల్సిన పరిస్థితి కనిపించింది. మరోవైపు రేపు ఉదయం రెండో రోజు ఆట ప్రారంభించే సమయానికి ఆసీస్‌ను త్వరగా ఔట్ చేయగలిగితే ఇండియాకు గెలుపు అవకాశాలు ఉంటాయని విశ్లేషణలు వస్తున్నాయి.
also read :
greece train accident : గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం.. అసలేం జరిగింది ?
Sreeleela : క్షమాపణలు చెప్పిన నటి శ్రీలీల.. కారణం ఏంటి?