Telugu Flash News

Bigg Boss 6: రేవంత్‌, శ్రీహాన్‌ ‘టికెట్‌ టూ ఫినాలే’ కోసం పోటీ.. విన్నర్‌ ఎవరు?

bigg boss telugu season 6

Bigg Boss 6: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం 13వ వారం ర‌స‌వత్త‌రంగా సాగుతుంది.టికెట్ టూ ఫినాలే కోసం కంటెస్టెంట్స్ అంద‌రు చాలా కృషి చేశారు. 13వ వారం మొత్తం దాదాపు దీని గురించే పోటి న‌డిచింది. అయితే శుక్రవారం ఎపిసోడ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది.

ఏకాభిప్రాయాలు, ఫైనల్ గా పోటీ పడేందుకు సభ్యుల మధ్య చర్చోపచర్చలు జరగ‌గా, మొదటి రౌండ్‌లో శ్రీ సత్య, ఇనయ ఛాన్స్ కోల్పోగా, కీర్తి కూడా ఎలిమినేట్‌ అయ్యారు. ఇక రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, రోహిత్‌, ఫైమాల మధ్య టికెట్ టూ ఫినాలే టాస్క్ జ‌రుగుతూ వ‌చ్చింది. అయితే ఫైనల్‌ రౌండ్‌ కోసం ఇచ్చిన టాస్క్ లు, ఏకాభిప్రాయాల కారణంగా రోహిత్‌, ఫైమా తప్పుకోవ‌ల్సి వ‌చ్చింది.

ఆది రెడ్డి కోసం హౌజ్‌మేట్స్ రెండు టీమ్‌ల మాదిరిగా విడిపోయి మాట‌ల తూటాలు పేల్చుకున్నారు. ఇన‌య నిర్ణ‌యాన్ని రోహిత్ వ్య‌తిరేఖిస్తూ… అన్‌ పెయిర్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారని, సిల్లీగా ఉందన్నారు.

అయితే టికెట్‌ టూ ఫినాలే అత్యధిక మార్కులు వచ్చిన ఆదిరెడ్డి, రేవంత్‌, శ్రీహాన్‌ ల మధ్య ట్రయా తలాన్‌ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో రేవంత్‌ మొదటి స్థానంలో, శ్రీహాన్‌ రెండో స్థానంలో, ఆదిరెడ్డి మూడో స్థానంలో నిలిచారు. అయితే రేవంత్‌ మార్కుల పరంగా మొదటి స్థానంలో ఉండ‌గా, శ్రీహాన్‌, ఆదిరెడ్డి కి టై అయింది.

అప్పుడు వీరిద్ద‌రి మధ్య మరో టాస్క్ పెట్టగా ఆదిరెడ్డి వెనకబడి పోయారు. దీంతో శ్రీహాన్‌ గెలిచారు. దీంతో రేవంత్‌, శ్రీహాన్‌ `టికెట్‌ టూ ఫినాలే` కోసం పోటీ పడబోతున్నారు.

ఇప్పుడు ఫైనల్‌ కోసం రేవంత్‌, శ్రీహాన్‌ మధ్య పోరు నెలకొనబోతుంది. హౌజ్‌లో స్నేహితులుగా ఉన్న రేవంత్‌, శ్రీహాన్‌ పోటీ పడబోతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మరి వీరిల్లో విన్నర్‌ ఎవరు?

ముందుగా ఫైనల్‌కి ఎవరు చేరతారు అనేది శ‌నివారం ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది..ఇక తాజా ఎపిసోడ్ చివర్లో నైట్‌ సమయంలో శ్రీ సత్యతో శ్రీహాన్‌ పులిహోర కలిపే ప్రయత్నం బెడిసి కొట్టినట్ట‌యింది.ఏదేమైన బిగ్ బాస్ చివ‌రి రోజుల‌లో ఆస‌క్తి క‌లిగిస్తుంది.

మరోవైపు బిగ్‌ బాస్‌ 6 తెలుగు 13 వారంలో రేవంత్‌, ఆదిరెడ్డి,కీర్తి, ఫైమా, రోహిత్‌ , శ్రీసత్య నామినేషన్‌లో ఉండ‌గా, వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

also read more news:

horoscope today : 03-12-2022 శనివారం ఈ రోజు రాశి ఫలాలు

చలికాలంలో వచ్చే జలుబు మరియు ఫ్లూ నివారణ కోసం ఈ 5 మసాలాలను తీసుకుంటే చాలు

Exit mobile version