Bigg Boss6 : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ కార్యక్రమంకి రేపటితో పులిస్టాప్ పడనుంది. 21 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు ఉండగా, వారిలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ అని ట్విస్ట్‌తో ఎలిమినేట్ చేశారు. ఈ ఎలిమినేషన్‌కి ముందు బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చాడు. టైటిల్ విన్నర్ పోటీకి గానూ టాప్ 5లో ఉండేందుకు అర్హత లేని సభ్యులెవరో తెలియజేయాలని వెల్లడించారు. హౌజ్‌మేట్స్ అంతా తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇందులో రోహిత్ పేరుని శ్రీహాన్ చెప్పగా, ఆదిరెడ్డి పేరుని కీర్తి చెప్పింది. కీర్తి పేరుని శ్రీ సత్య, శ్రీహాన్ పేరుని రోహిత్, కీర్తి పేరుని మళ్లీ రేవంత్, ఆదిరెడ్డి చెప్పారు.
దీంతో హౌజ్‌మేట్స్ అత్యధికంగా మూడు ఓట్లతో కీర్తి బయటకు పంపేందుకు సిద్ధం కాగా, హౌజ్ మేట్స్ అభిప్రాయం ప్రకారం కీర్తి బయటకు వెళ్లాలి. కానీ ఇక్కడే ట్విస్ట్ పెట్టారు బిగ్ బాస్. ఇది కేవలం హౌజ్‌మేట్స్ అభిప్రాయం మాత్రమే అని వెల్లడించారు. ఆడియెన్స్ నిర్ణయించిందే ఫైనల్ అని తెలుపుతూ, అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిలో శ్రీసత్య నిలవడంతో ఆమెని గ్రాండ్ ఫైనల్‌కి రెండు రోజుల ముందు ఎలిమినేట్ చేయడం విశేషం. ఆమెకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండానే ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. గ్రాండ్ ఫినాలే రోజు ఆమె చేత మాట్లాడించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక శుక్రవారం ఎపిసోడ్ లో శ్రీహాన్, కీర్తిలకు డైరెక్ట్ గా ఆడియెన్స్ తో మాట్లాడి, తనకు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. ఇందులో శ్రీహాన్, కీర్తిల మధ్య ఓ టాస్క్ పెట్టగా, శ్రీహాన్ విన్నర్ గా నిలిచి ఆడియెన్స్ తో ఓటు కోసం మాట్లాడారు. తాను కొన్ని తప్పులు చేశానని, వాటిని సరిదిద్దుకున్నానని, తప్పులకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు శ్రీహాన్. తాను విన్నర్‌గా నిలవాలనుకుంటున్నానని, అందుకు ఓట్లు వేసి గెలిపించాలంటూ కోరాడు. మరో టాస్క్ లో కీర్తి విన్నర్ అయ్యారు. బిగ్ బాస్ షో ద్వారా గెలిచే డబ్బుల తన సొంతానికి వాడుకోనని, సోషల్ వర్క్ కోసం వాడుతానని, తనలాంటి వారికి హెల్ప్ చేస్తానని చెప్పుకొచ్చింది. మొత్తానికి రేపు జరగనున్న ఫినాలేలో ఎవరు కప్ అందుకుంటారో చూడాల్సి ఉంది.