Homebigg boss telugu season 6Bigg Boss 6: హౌజ్‌లోకి సోహైల్.. సిరి, శ్రీహాన్ మ‌ధ్య చిచ్చు పెట్టి క‌థ మొత్తం మార్చేశాడుగా..!

Bigg Boss 6: హౌజ్‌లోకి సోహైల్.. సిరి, శ్రీహాన్ మ‌ధ్య చిచ్చు పెట్టి క‌థ మొత్తం మార్చేశాడుగా..!

Telugu Flash News

Bigg Boss 6: బిగ్ బాస్ సీజ‌న్ 6 ఇక చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలో కుటుంబ స‌భ్యులు హౌజ్‌లోకి ప్ర‌వేశిస్తూ తెగ సంద‌డి చేస్తున్నారు. శ‌నివారం రోజు నాగార్జున‌తో క‌లిసి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ హంగామా చేశారు. శనివారం ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవ‌డ‌మే కాదు, ఇనయ సీక్రెట్‌లు బయటపడటం విశేషం.

ఇనయ కోసం శనివారం ఎపిసోడ్‌లో బిగ్‌ బాస్‌ 4 స్ట్రాంగ్‌ కంటెస్టెంట్ అయిన సోహైల్‌ వచ్చాడు. ఇనయ బ్రదర్‌ ఇమ్రాన్‌ తో కలిసి ఆయన షోకి రాగా, ఆ స‌మ‌యంలో ఇన‌య సోహైల్‌పై తన ఫీలింగ్ తెలియ‌జేసింది.

రెండేళ్లుగా సోహైల్‌పై క్రష్‌ ఏర్పడింది, ఎలాగైనా ఆయన్ని కలవాలని, సోహైల్‌ మణికొండలో ఉంటున్నాడని తెలుసుకుని అక్కడికి షిఫ్ట్ అయ్యాను. సోహైల్‌ చేసే జిమ్‌లోనే చేరాను అని ఇన‌య చెప్పుకొచ్చింది.inaya sultana bigg boss 6

సోహైల్‌ తరచూ ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడేవాడని, వారితో క్లోజ్‌గా ఉండడ‌డంతో తాను జెలసీగా ఫీలయి జిమ్‌ ని వదిలేశానని తెలిపింది ఇనయ‌.. సోహైల్‌ తో మాట్లాడాల‌ని, ఆయన నెంబర్‌ తీసుకోవాలని ప్ర‌య‌త్నించిన అది కుదరలేదని తెలిపింది.

ఇప్పుడు బిగ్‌ బాస్‌ 6 వేదిక కలవడం, మాట్లాడటం చాలా హ్యాపీగా ఉందంటూ ఇన‌య పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే సోహైల్‌.. శ్రీహాన్, సిరి మ‌ధ్య చిచ్చు పెట్టాడు. పోయిన‌సారి సిరి బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఉండగా, శ్రీహాన్‌ బయట అమ్మాయిలతో తిరుగుతూ కనిపించాడ‌ని సోహైల్ అన్నాడు. . ఓ సారి కూకట్‌ పల్లిలో ప్రియాంక అనే అమ్మాయితో కాఫీ షాపులో కనిపించాడని చెప్పి షాకిచ్చాడు.

సిరితో కాకుండా మరో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో చూశానని సోహైల్ గ‌ట్టిగా చెప్ప‌డంతో శ్రీహాన్‌ దాన్ని కవర్‌ చేసుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. అది షూటింగ్ లోనే కలిశామని, తనకు నాకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చిన సోహైల్ మాత్రం బాగానే ఇరికించాడు.

-Advertisement-

సిరి బయట ఉంటే ఎక్కడ ఉన్నావో చెప్పాల్సి వచ్చేదని, వీడియో కాల్‌ చేసేదని, కానీ హౌజ్‌లో ఉండటం వ‌లన ఓ అమ్మాయితో స‌ర‌దాగా టూర్‌ వెళ్లాడని తెలిపాడు సోహైల్‌. మొత్తానికి ఇన‌య కోసం వచ్చిన సోహైల్ శ్రీహాన్‌ని గ‌ట్టిగానే ఇరికించాడు.

also read news:

Horoscope today: 27-11-2022 ఆదివారం రాశి ఫ‌లాలు..

మెంతికూర నువ్వుల పచ్చడి.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటుంది..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News