Telugu Flash News

bigg boss telugu 6 : బిగ్ బాస్ పెద్ద చిచ్చు పెట్టాడుగా.. ఇక ఫైటింగ్ పీక్స్‌లోనే..!

bigg boss telugu season 6

bigg boss telugu 6 : బిగ్ బాస్ సీజ‌న్ 6 రంజుగా సాగుతుంది.  ఈ షోకి సంబంధించిన 61వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ విచిత్ర‌మైన టాస్క్‌లు ఇస్తుండ‌గా, కంటెస్టెంట్స్ గ‌ట్టిగానే పోటీప‌డుతున్నారు. అంతేకాదు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటూ మ‌జా అందిస్తున్నారు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో కెప్టెన్సీ టాస్క్ న‌డుస్తుండ‌గా, ఎవ‌రికి వారు చాలా ట‌ప్ ఫైట్ ఇస్తున్నారు. కొంద‌రు నోరు జారుతున్నారుకూడా. అయితే ఇన‌య మాత్రం హౌజ్‌లో కాక రేపుతుంది. హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన సూర్యను తలుచుకుంటూ.. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్న‌ట్టుగా కనిపిస్తుంది.

వార్ భీక‌రంగా ఉందిగా..

నా ప్లేట్ కనిపించకుండా పోయింది, సూర్య ప్లేట్ లో తింటున్నాను అంటూ హౌస్ లో కొత్త గొడవకు తెరలేపింది ఇనయా. . ఇక ఇన‌య ర‌చ్చ‌కు మిగ‌తా వాళ్లు చిరాకుప‌డుతున్నారు. కీర్తి, మెరినాలు మాత్రం ఇనయాను పాంపరింగ్ చేస్తూ..బ్రతిమలాడి బుజ్జ‌గిస్తున్నారు. ఇక తాను సూర్య ప్లేట్ లో తింటున్నా అని కావాలనే ఆ ప్లేట్ దాచారంటూ ఇన‌య ఫైర్ అయ్యింది. ఇనయా. ఈ విషయంలో శ్రీహాన్ ఆమెతో వాదనకు దిగాడు. అటు రేవంత్ కూడా తన వర్షన్ వినిపించాడు. గేమ్ విషయంలో అందరూ ఫైర్ తో ఆడుతున్నారు. ఎవరూ ఎక్కడా తగ్గడంలేదు. రోహిత్-ఇనయాలతో రేవంత్ మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి.

రేవంత్ ను త్వరగా మాన్యూప్లేట్ చేయవచ్చు అన్న ఐడియాతో బ్లూటీమ్ వాళ్ళు.. రెడ్ టీమ్ లో ఉన్న రేవంత్ ను ప‌దే పదే రెచ్చగోడుతున్నారు. అటు ఆది రెడ్డి -గీతు మద్య కూడా శత్రుత్వం వచ్చేలా క‌నిపిస్తుంది. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రేట్ టాస్క్ తో ఆదిరెడ్డి రెచ్చిపొయి ఆడుతున్నారు. అటు గీతూను ఓడించి చంపేశారు బ్లూటీమ్. అయినా కూడా ఆదిరెడ్డి డ్రెస్ దాచి గేమ్ లో ఫైర్ పెంచింది గీతు గీతూనే తీసి ఉంటుంది అని ఆదిరెడ్డి కూడా ఫిక్స్ అయ్యి ఉన్నాడు. అటు గీతూ టీమ్ నుంచి రెండు గ్రానెట్ లు తీసి దాచింది ఇనయా. కాని అది కనిపెట్టిన గీతూ.. మళ్లీ వాటిని ద‌క్కించుకుంది.. అటు ఎవరికి వారు గేమ్ ప్లానింగ్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

horoscope today : 4-11-2022 శుక్రవారం రాశి ఫలాలు మీ కోసం..

Diabetes : మధుమేహం ఉన్నవారికి పప్పులు మంచివేనా? ఏ పప్పు తీసుకోవడం మంచిది?

Exit mobile version