Homebigg boss telugu season 6Bigg Boss 6 : కెప్టెన్సీ పీఠం ద‌క్కించుకున్న కామ‌న్ మ్యాన్.. అర్జున్‌ని జైలుకి పంపారుగా..!

Bigg Boss 6 : కెప్టెన్సీ పీఠం ద‌క్కించుకున్న కామ‌న్ మ్యాన్.. అర్జున్‌ని జైలుకి పంపారుగా..!

Telugu Flash News

Bigg Boss 6 : కామ‌న్ మ్యాన్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి త‌న‌దైన శైలిలో గేమ్ ఆడుతూ బిగ్ బాస్ హౌజ్ మూడో కెప్టెన్‌గా నిలిచాడు ఆది రెడ్డి. గ‌త కొద్ది రోజులుగా కెప్టెన్సీ టాస్క్ న‌డుస్తుండ‌గా, శుక్ర‌వారం రోజు ఎపిసోడ్‌లో దీనికి శుభం కార్డ్ ప‌డింది. ఆదిరెడ్డి హౌజ్‌కి మూడో కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు.

అయితే కెప్టెన్సీ టాస్క్ కోసం ఎత్తర జెండా టాస్క్ ఇవ్వ‌గా, ఇందులో ఇసుకని కాడికి ఓ వైపు ఖాళీ బాక్స్ లో పోస్తే, మరోవైపు ఉన్న పైకి లేస్తుంది. అందులో వారి జెండా ఉంటుంది. ఎవరిదైతే ఫస్ట్ పైకి లేస్తుందో వాళ్లే విన్నర్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ ఈ ఫిజికల్ టాస్క్‌లో ఆదిరెడ్డి గెలిచి కెప్టెన్ అయ్యాడు.

గంద‌ర‌గోళం..

ఇక ఆదిరెడ్డి కెప్టెన్ కావ‌డంతో భార్య‌ని త‌ల‌చుకుంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. ల‌వ్యూ క‌వితా.. నువ్ హ్యాపీనా అంటూ భార్యని తలుచుకున్నాడు. నన్ను అర్ధం చేసుకుని బిగ్ బాస్ హౌస్‌కి పంపావ్.. ముందు ముందు ఇంకా చాలా చూపిస్తా అని అన్నాడు.

ఇక అందాల బ్యూటీ ఆఫ్ బిగ్ బాస్ హౌజ్‌గా పేరు తెచ్చుకున్న‌ వాసంతి క్రిష్ణన్ ఈవారం బ్యాగ్ సర్దేసేది తానేనని ఫిక్స్ అయ్యింది. ఇనయ దగ్గర కూర్చుని నువ్వు నేను ఆరోహి మన ముగ్గురం ఈ వారం డేంజ‌ర్‌లో ఉంటాం అంటూ భ‌విష్య‌త్‌ని త‌ల‌చుకొని భ‌య‌ప‌డుతూ క‌నిపించింది.

ఇక హౌజ్‌లో సూర్య, ఆరోహి సరసాలు పీక్స్‌కి చేరిన‌ట్టే క‌నిపిస్తుంది. అర్ధరాత్రి వీరి ముచ్చ‌ట్లు చూస్తుంటే అప్పట్లో సిరి-షణ్ముఖ్‌లను గుర్తుకు వ‌స్తున్నారు. ఇక జీరో టైమింగ్‌ కోసం ముగ్గురు పోటీ ప‌డ‌గా, అందులో కీర్తి, ఆరోహి, అర్జున్ ఉన్నారు. ఈ ముగ్గురుచర్చించుకున్నాక అర్జున్ జైలుకి వెళ్లాడు.

అయితే కీర్తికి జీరో రావ‌డం ప‌ట్ల కాస్త ఎమోష‌న‌ల్ అయింది. చివర్లో చంటి కామెడీ పంచ్‌లు ప్రేక్ష‌కుల‌కి కాస్త న‌వ్వులు పంచాయి. ఇక ఈ రోజు శ‌నివారం కావ‌డంతో నాగార్జున ఎంట్రీ ఉంటుంది. ఆయ‌న ఎవ‌రిని మెచ్చుకుంటాడో, ఎవరికి అక్షింత‌లు వేస్తాడో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News