Bhuvneshwar Kumar: బాగా ఆడితే నెత్తిన పెట్టుకోవడం, విఫలమైతే దారుణంగా ట్రోలింగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటి వరకు కోహ్లీ సరిగా ఆడలేదని బాగా ట్రోల్స్ చేసిన వారు ఇప్పుడు భువనేశ్వర్‌ని విమర్శిస్తున్నారు.
ఆసియా కప్‌లో దారుణమైన పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన భువీ ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమికి కారణమయ్యాడని కొందరు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.ప్రపంచకప్‌లో అతనిని ఎంపిక చేస్తే మాత్రం ఓడిపోవడం ఖాయం అని అంటున్నారు.
డెత్ ఓవర్స్‌లో భువీ బౌలింగ్ దారుణంగా ఉందని కొందరు ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భువనేశ్వర్ కుమార్ భార్య నుపర్ నగర్.. ఘాటుగా బదులిచ్చింది.
ఘాటు సమాధానం..
ఈ రోజుల్లో కొంత మంది పని పాట లేకుండా ఉంటున్నారు. ఎదటి వారిపై విషం చల్లడానికే సిద్ధంగా ఉంటున్నారు. ఇక్కడ మీ మాటల వలన ఎవరు హర్ట్ కారు.
ఇతరుల మీద ద్వేషం చూపించడానికి బదులు ఆ సమయాన్ని మీ జీవితాలను బాగు చేసుకోవడం కేటాయించడం అలవాటు చేసుకోండి. అది చాలా కష్టమే అనుకోండి. కానీ ట్రై చేయండి అని భువీ భార్య ఘాటుగానే స్పందించింది.
అయితే కొందరు నుపుర్ నగర్‌ను వెనుకేసుకొస్తుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. భర్తను వెనుకేసుకొస్తున్నావ్ కానీ.. అతని వల్లే భారత్ కీలక మ్యాచ్‌లు ఓడిపోయిందనేది నిజం కాదా అని అంటున్నారు.
ఆసియాకప్ ఫైనల్ చేరకుండా ఇంటిదారి పట్టడం, ఇప్పుడు ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఓడిపోవడం భువీ వలన కాదా అంటూ కొందరు అతడిని విమర్శించారు. ఇలానే ఆడితే ప్రపంచకప్‌లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఆసీస్ తో మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన భువేశ్వర్ ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. 17, 19వ ఓవర్ బౌలింగ్ చేసి ఆ ఓవర్లలో 15, 16 పరుగులిచ్చాడు. భువీ ఆటపై సునీల్ గవాస్కర్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.