HomecinemaBhola Shankar : కోర్టు కేసులో భోళా శంకర్‌! చిరు షాక్!

Bhola Shankar : కోర్టు కేసులో భోళా శంకర్‌! చిరు షాక్!

Telugu Flash News

Bhola Shankar : ఎన్నో సినిమాలు తీసిన ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేతలు ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్.. తనను మోసం చేశారని విశాఖపట్నంకు చెందిన ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూటర్ బత్తుల సతీష్ ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ బుధవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

భోళాశంకర్ నిర్మాతలు తమను మోసం చేశారని..అందుకే భోళా శంకర్ సినిమాపై స్టే కోసం సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఏజెంట్ సినిమా పంపిణీ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణకిషోర్ తనను మోసం చేశాడని, వారి నిజస్వరూపం బట్టబయలైందని, జరిగిన అన్యాయం అందరికీ తెలియాలని సతీష్ ఆరోపించాడు.

ఏప్రిల్‌లో విడుదలైన ‘ఏజెంట్‌’ సినిమా పంపిణీ హక్కులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక మూడు రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు ఇస్తానని లిఖితపూర్వక ఒప్పందం చేసుకున్నాడు.ఆ తర్వాత మే 1న హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి వెళ్లి గరికపాటి కృష్ణ కిషోర్‌ను కలిశానని బత్తుల సతీష్ తెలిపారు. అనంతరం అనిల్ సుంకరతో మాట్లాడారు.

సినిమాకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని… సినిమా డిజాస్టర్ అయిందని, మరుసటి రోజు ఆఫీసుకు వస్తే అండర్ టేకింగ్ లెటర్ ఇస్తానని లెటర్ కూడా ఇచ్చాడని చెప్పాడు. చివరికి డబ్బు వస్తుందన్న నమ్మకంతో వైజాగ్ నుంచి వెళ్లిపోవడాన్ని ప్రస్తావించాడు.అయితే ఆ తర్వాత విశాఖపట్నం వరకు “సామజవరగమన” సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చారు.

తన దగ్గర ఉన్న కొద్ది మొత్తం మాత్రమే కవర్ అవుతుందని, మిగిలిన డబ్బు 45 రోజుల్లో చెల్లిస్తానని.. లేదంటే తదుపరి సినిమాను ఆపేయవచ్చని కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు వారి తదుపరి చిత్రం “భోళా శంకర్” అని బత్తుల సతీష్ అన్నారు.. అయితే కొద్ది రోజులుగా సమాధానం చెప్పడం మానేశారు. ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్ పెద్దలకు కూడా చెప్పినట్లు తెలిపారు.

తాను ఇప్పటికే చాలా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశానని.. కానీ డబ్బులకు, మోసాలకు సంబంధించి ఎప్పుడూ ఎలాంటి సమస్యలు లేవని… చివరకు ఫోర్జరీ ఆరోపణలు చేశారని ఆరోపించారు. నిజానికి తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని, అందుకే మీడియాలో ఎక్కడికీ వెళ్లకుండా మౌనంగా ఉండి ముందుకు వెళ్లానని వివరించాడు.

-Advertisement-

ఈరోజు సాయంత్రం సివిల్ కోర్టులో సమస్య పరిష్కారమైన తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తామన్నారు. అయితే బోళా శంకర్ మాత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సమయంలో కోర్ట్, స్టే అంటూ హడావుడి చేయడం ఏంటని మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

also read :

today rasi phalalu in telugu : 09/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News