Bhanu Priya: 80 ల్లో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన భానుప్రియ.. ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు . ఐదేళ్ల క్రితం భానుప్రియ భర్త ఆదర్శ్ కౌశల్ కన్నుమూయడంతో ఆమె కాస్త విషాదంలో కూరుకుపోయారు.
ఆ తరవాత కొన్నాళ్ల నుంచి తనకు ఆరోగ్యం బాగుండడం లేదని.. మెమరీ లాస్‌తో బాధపడుతున్నానని భానుప్రియ చెప్పారు. ఈ మధ్య ఒక సినిమా లొకేషన్లో డైలాగులు మరిచిపోయానని భానుప్రియ అన్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన చాలా విషయాలను తాను మరిచిపోతున్నానని చెప్పుకొచ్చారు.
ఇక భర్తతో భానుప్రియ ఎప్పుడో విడిపోయారని వచ్చే వార్తలపై కూడా ఆమె స్పందించారు. ‘‘మేం విడిపోలేదు. ఆయన హైదరాబాద్‌లో ఉండేవారు. నేను చెన్నైలో ఉండేదాన్ని. నా భర్తతో నేను విడాకులు తీసుకోలేదు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది’’ అని భానుప్రియ వివరణ ఇచ్చారు.
తన ఏకైక కూతురు అభినయ లండన్‌లోని లాఫ్‌బరో యూనివర్శిటీలో చదువుకుంటోంది. నేచురల్ సైన్స్ అనే సబ్జెక్ట్ తీసుకుంది. కాలేజ్ సెలవులు ఇవ్వగానే ఇక్కడికి వచ్చేస్తుంది. పాపకు ఇప్పుడు వయసు 20 ఏళ్లు’’ అని భానుప్రియ చెప్పారు.
also read :
Viral video : వందే భారత్‌లో పూర్ క్వాలిటీ ఆహారం సరఫరా..
Asia Cup 2023 వేదిక మార్పు! పాకిస్తాన్‌కు షాక్ తప్పదా?