Rashmika: నేషనల్ క్రష్‌గా రష్మిక మందాన ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌ని దున్నేస్తుంది. వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఈ అమ్మడు ఎవరితో అయిన కాస్త చనువుగా ఉంటే వారితో రిలేషన్ అంటగట్టేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్నాళ్లు విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం గట్టిగా జరగగా, మధ్యలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది.
ఓ బాలీవుడ్ ఈవెంట్లో ఇద్దరూ కలవడం, అలానే పలు సందర్భాల్లో ఎయిర్ పోర్ట్ లో జంటగా దర్శనమివ్వడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్-రష్మిక ఎఫైర్ నడుపుతున్నారన్న ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. రష్మికతో నేను డేటింగ్ చేస్తున్నాను అని వస్తున్న వార్తలు అవాస్తవాలు. వృత్తిరీత్యా తరచుగా హైదరాబాద్ నుండి ముంబై వెళుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి ఎయిర్ పోర్ట్ లో కలుస్తాము. మేము ఎప్పుడు కలిసి ప్రయాణం చేసింది లేదు. రెండు మూడు సందర్భాల్లో ఇద్దరం పక్కపక్కనే కనిపించేసరికి ఇలాంటి పుకార్లు వచ్చాయి. స్నేహానికి మంచి మా మధ్య ఎలాంటి బంధం లేదని బెల్లంకొండ చెప్పుకొచ్చారు.