Homeviral newsViral Video: సూప‌ర్ మార్కెట్‌లో చొర‌బ‌డ్డ ఎలుగుబంటి.. రాత్రంతా మంచిగా తినుకుంటూ కూర్చుందే...!

Viral Video: సూప‌ర్ మార్కెట్‌లో చొర‌బ‌డ్డ ఎలుగుబంటి.. రాత్రంతా మంచిగా తినుకుంటూ కూర్చుందే…!

Telugu Flash News

Viral Video: సోష‌ల్ మీడియాలో నిత్యం జంతువుల‌కి సంబంధించిన వీడియోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి.ఆవు, కుక్క‌, పులి, ఏనుగు, జింక వంటి జంతువులు చేసే ప‌నులు కొంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుండ‌గా, అవి తెగ వైర‌ల్ అవుతుంటాయి. వాటి చేష్ట‌లు చూసి మ‌నం ఆశ్చ‌ర్య‌పోతుంటాం.

తాజాగా ఎలుగుబంటికి సంబంధించిన వీడియో ఓక‌టి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందించ‌డంతో పాటు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో బాగా ఆక‌లితో ఉన్న ఎలుగుబంటి సూప‌ర్ మార్కెట్‌లోకి దూరి అన్నింటిని తినేయ‌డం గ‌మ‌నించ‌వచ్చు.

ఆకలి అనేది జంతువులకైనా కానీ మనుషులకైనా ఒకేలాఉంటుంది. కాలిఫోర్నియాలోని ఒలంపిక్ వ్యాలీలో ఆకలితో ఉన్న ఓ ఎలుగుబంటి సూప‌ర్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఆ ఎలుగుబంటి అందులో ఉన్న తినుబండారాలన్ని తింటూ రాత్రంతా గడిపింది.

అక్కడే పనిచేస్తున్న ఓ క్యాషియర్ స్టోర్ డోర్ తెరిచి ఉండటం గమనించి ఏం జ‌రుగుతుందా అని లోప‌లికి వెళ్ల‌గా, అక్క‌డ ఉన్న ఎలుగుబంటిని చూసి షాక‌య్యాడు. మొద‌ట దానిని చూసి న‌మ్మ‌లేక‌పోయిన త‌ర్వాత మాత్రం ఎల‌గుబంటి అనుకొని షాక్ అయిన‌ట్టు చెప్పాడు.

ఇదివరకు తాను చూసిన వాటి కంటే ఈ ఎలుగుబంటి 20 నుంచి 30 శాతం పెద్దగా ఉంద‌ని ఆ వ్య‌క్తి అన్నాడు. అయితే తన వెనకాల వైపు ఒక డోర్ ఉందని అందుకోసమే తాను ధైర్యంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు, లేకుంటే పరిస్థితి మ‌రోలా ఉండేద‌ని అని వివరించాడు.

అది ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అత‌ను ప‌లు సూచ‌న‌లు చేశాడు. ఈ వీడియోకి ఆ వ్యక్తి థీఫ్ మ్యాన్ అని క్యాప్షన్ పెట్ట‌గా, ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News