HomecinemaBandla Ganesh: వాడు మ‌నిషేనా అంటూ పూరీని బండ్ల గ‌ణేష్ అలా తిట్టేసాడేంటి?

Bandla Ganesh: వాడు మ‌నిషేనా అంటూ పూరీని బండ్ల గ‌ణేష్ అలా తిట్టేసాడేంటి?

Telugu Flash News

Bandla Ganesh: బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప‌వ‌న్ భ‌క్తుడిగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన బండ్ల ఎక్కువ‌గా వివాదాల‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాడు. ఆయ‌న కొద్ది రోజుల క్రితం చోర్ బ‌జార్ ఈవెంట్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. పూరి తనయుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ .. పూరీ జ‌గ‌న్నాథ్‌ని ఉద్దేశిస్తూ, సొంత కొడుకుని పట్టించుకోకుండా ఎవరెవరినో సూపర్ స్టార్స్ చేస్తావు. ఈ ర్యాంపులు, వ్యాంపులు వస్తుంటారు పోతుంటారు.. ఫ్యామిలీ ముఖ్యం అంటూ బండ్ల గణేష్ ఏకి పారేశాడు. ఈ వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారాయి. బండ్ల గ‌ణేష్ ఎందుకు ఆ రోజు అలా మాట్లాడాడో ఎవ‌రికి అర్ధం కాలేదు.

ఘాటు ఘాటుగా..

ఇక తాజాగా మ‌రో సారి బండ్ల గ‌ణేష్.. పూరీ జ‌గ‌న్నాథ్‌పై హాట్ కామెంట్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా బండ్ల ఓ ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌గా, ఆ ఇంట‌ర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది.

ఆ ప్రోమోలో ఇక పూరీ టాపిక్ రాగా, భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషా అన్నా.. అని తిరిగి ప్రశ్నించాడు.వ్యాపారాలు, వ్యాపకాలు చాలానే ఉన్నాయి కదా.. వాటిని పక్కన పెట్టి రాజకీయాల‌లో ఎందుకు వేలు పెడుతున్నార‌ని ప్ర‌శ్నించ‌గా, దానికి స్పందించిన బండ్ల‌.. నేను నేను ఎక్కడ కెలికాను. నన్ను ఇరికించాలను చూడకు. శకుని క్యారెక్టర్ నా దగ్గర ప్లే చేయకు అంటూ బండ్ల గణేష్ ఒకింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

ఇక పోసాని చావు మాములుగా ఉండదు అని బండ్ల అన్నారు. . ఆయనకు కూడా ఓ కుటుంబం ఉంటుంది కదా, మీరు అలా ఎలా అంటారు .. అని యాంకర్ అన‌డంతో నువ్ పెట్టే బోనులో పడే ఎలుకలు చాలా ఉంటాయి. కానీ బండ్ల గణేష్ పడడు అంటూ చుర‌కలు అంటించాడు.

ఇక ఎన్టీఆర్ గారిని అంటే సమాధానం ఇస్తా.. మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా.. పోసాని అంటే ఆన్సర్ ఇస్తా.. లింక్ లు పెడితే చెప్పను.. నా మీద కోపం ఉంటే నన్ను తిట్టాలి. అంతేకానీ మా అమ్మ నాయన ఏం చేశారు అంటూ బండ్ల గ‌ట్టిగానే స్పందించాడు.

కాని పూరీ గురించి బండ్ల మాట్లాడిన మాట‌లు ఇప్పుడు తెగ హాట్ టాపిక్ అయ్యాయి. కాగా, పూరి జగన్నాధ్, బండ్ల గణేష్ కాంబినేషన్ లో ఇద్దరమ్మాయిలతో, టెంపర్ రెండు చిత్రాలు వచ్చిన విష‌యం తెలిసిందే. గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ లాంటి హిట్ చిత్రాలు నిర్మించిన బండ్ల గణేష్ ఇటీవల నిర్మాతగా సినిమాలు చేయ‌డ‌మే మానేశాడు..

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News