HomecinemaBan Adipurush Movie : ఆదిపురుష్ సినిమాను నిషేధించాలి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ

Ban Adipurush Movie : ఆదిపురుష్ సినిమాను నిషేధించాలి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ

Telugu Flash News

Ban Adipurush Movie : ఆదిపురుష్ సినిమాను నిషేధించాలని అఖిల భారత సినీ కార్మికుల సంఘం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. దేశవ్యాప్తంగా సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని ఆ లేఖ లో కోరారు. థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఆదిపురుష్ ప్రదర్శనను తక్షణమే నిషేధించాలని ఆదేశించాలని సినీ కార్మికుల సంఘం మోదీని లేఖలో అభ్యర్థించింది.

ఆదిపురుష్ చిత్ర దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ శుక్లాపై కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని మోదీని కోరింది. సినిమా స్క్రీన్ ప్లే, డైలాగ్స్, రాముడు. హనుమంతుని గౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు.

ఆదిపురుష్ సినిమా హిందువులు, సనాతన ధర్మం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అసోసియేషన్ లేఖలో పేర్కొంది. దేశంలో ప్రతి ఒక్కరూ రాముడిని దేవుడిగా ఆరాధిస్తారు.. కానీ ఆదిపురుష్ సినిమాలో రాముడు, రావణుడు వీడియో గేమ్‌లలో పాత్రలు లాగా చేశారు. అలాగే ఈ సినిమాలోని కొన్ని డైలాగులు భారతీయులను కించపరిచేలా ఉన్నాయి. రామాయణం భారతదేశ ప్రజలకు విశ్వాసమని ఆయన అన్నారు.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న దేశవ్యాప్తంగా హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం మరియు తమిళ భాషల్లో విడుదలైంది.

read more :

Adipurush : నెగెటివ్ రివ్యూ ఇస్తున్నాడని.. ప్రభాస్ ఫ్యాన్స్ దాడి.. వీడియో వైరల్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News