నందమూరి తారకరత్న (Tarakaratna) ఇటీవల గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
కుప్పంలో యాంజియోప్లాస్టి తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం చికిత్స కొనసాగిస్తున్నారు.. గుండె స్పందన సాధారణంగా ఉన్నా.. మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని వెల్లడించారు.
గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాల పాటు రక్త ప్రసరణ నిలిచిపోయిందని.. దీంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించినట్లు పేర్కొన్నారు.
తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన బాలకృష్ణ.. తారకరత్న గుండె చప్పుడు కాసేపు ఆగిపోయిందని.. ఆ తర్వాత అద్భుతం జరిగిందని అన్నారు.
తారకరత్న ఆరోగ్యంలో మార్పులు తమలో విశ్వాసాన్ని పెంచాయని అన్నారు. తారకరత్న శరీరంపై రెండుసార్లు గిల్లినప్పుడు.. ఒకసారి స్పందించారని, కళ్ళలో కదలికలు చూశామని తెలిపారు.
అంతర్గత రక్తస్రావం, శరీరంలో అక్కడక్కడా రక్తం గడ్డకడినట్లు వైద్యులు చెప్పారని, శరీర అవయవాలు అయితే బాగానే ఉన్నాయని బాలయ్య అన్నారు.
వైద్యులు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారని, ఆయన కూడా పోరాడుతున్నారని అన్నారు. తారకరత్న కోలుకోవాలని ప్రతి ఒక్కరు ప్రార్ధిస్తున్నారు.
also read:
Telangana Budget 2023 : బడ్జెట్‌కు ఆమోదం తెలపని గవర్నర్.. ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుంది?
Gongadi Trisha : అండర్-19 ప్రపంచ కప్‌లో అదరగొట్టిన తెలుగమ్మాయి