cold remedies : how to get rid of cold and cough at home
1. శీతాకాలంతో చాలా మందికి జలుబు, దగ్గు వస్తుంటాయి. జలుబు బారిన పడితే వారితోపాటు పక్కనున్న వారికీ ఇబ్బంది కలుగుతుంది.
2. సీజన్ మారినప్పుడల్లా గొంతు సమస్యలు, ముక్కుదిబ్బడ, దగ్గు వ్యాపిస్తుంటాయి. వాటి నుంచి రక్షణ పొందేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
3. జలుబు, దగ్గును తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చక్కటి చిట్కాలు సూచించారు.
4. వేడి నీటిలో కల్లుప్పు (రాళ్ల ఉప్పు) వేసి రోజుకు రెండు సార్లు పుక్కిలించడం ద్వారా జలుబు, దగ్గు తగ్గుముఖం పడతాయి.
5. ఒక స్పూన్ నెయ్యిని వేడి చేసి రెండు లవంగాలు వేసుకొని గోరువెచ్చగా తీసుకుంటే దగ్గు, గొంతునొప్పిని నివారిస్తుంది.
6. జ్వరం, ముక్కు దిబ్బడ తగ్గాలంటే తులసి ఆకులతో టీ చేసుకొని తాగండి.
7. చిన్న అల్లం ముక్కను ఓ గ్లాసు నీటిలో వేసి మరిగించి అందులో ఓ స్పూన్ తేనె కలిపి తాగితే గొంతులో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
8. ఆవిరి పట్టుకోవడం ద్వారా ముక్కుదిబ్బడ, ఛాతిలో నొప్పి సమస్యలకు తక్షణమే రిలీఫ్ పొందవచ్చు.
9. చలికాలంలో కాస్త గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల జలుబు, సైనస్ సమస్యలు దూరమవుతాయి.
10. ఓ గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్లు మటుమాయం అవుతాయి.
also read:
Anant Ambani – Radhika Merchant engagement photos.. Celebrities Attends..
World Coldest City : ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశం.. ఎక్కడో తెలుసా? ఏడాది పొడవునా మైనస్ డిగ్రీలే!
TSPSC group 1 : గ్రూప్ 1 మెయిన్స్‌లో మార్పులు.. ఛాయిస్ తగ్గించేశారు!
Govt Old Vehicles : 15 ఏళ్లు నిండిన ప్రభుత్వ వాహనాలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచే అమలు!