ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నచిత్రం అవతార్ 2 (Avatar The Way Of Water) . డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ అనేక భాషల్లో విడుదలవుతోంది. అవతార్ సినిమా అంటే విజువల్ ఎఫెక్ట్‌తో కూడిన పండగ. మొదటి పార్ట్ ఎంతటి బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో రెండో పార్ట్ కూడా అంతకుమించి అన్నట్లు ఇప్పటి వరకు అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ వాటిని నిజం చేస్తోందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.
హాలీవుడ్ నిర్మాత జేమ్స్ కామెరోన్ అద్భుత సృష్టే అవతార్ మూవీ. అత్యంత భారీ బడ్జెట్‌తో 2009లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న అవతార్ 2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వరల్డ్ వైడ్ ఈ మూవీ 160 దేశాల్లో అనేక భాషల్లో విడుదలవుతోంది. విజువల్ వండర్‌గా సాగిపోయే ఈ చిత్రాన్ని పిల్లల నుంచి పెద్దల దాకా అనేక మంది చూద్దామని ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు ట్రైలర్‌ను కూడా ఇటీవల విడుదల చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా సినిమా రంగంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పండోరా జాతికి సంబంధించిన కథను ఈ చిత్రంలో చూపిస్తున్నారు. అవతార్ అనే భూమిపై పండోరా జాతిని రక్షించుకొనేందుకు యుద్ధం అనివార్యమైతే నీటి అడుగు భాగాన యుద్ధం జరిగే ఘట్టమే అవతార్ 2లో చూపించారు. సముద్రంపై పండోరా జాతి ప్రయాణం, వారి జీవన శైలి, యుద్ధంలో వారి పరాక్రమాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ విషయం ట్రైలర్ చూసిన వారికి ఇప్పటికే అర్థమై ఉంటుంది.
అత్యాధునిక టెక్నాలజీ వినియోగం..
అవతార్ 2 మూవీ కోసం 4కే, త్రీడీ, లైవ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సామ్ వర్తింగ్టన్, జో సాల్డనా, సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్ లాంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ మొదటి పార్ట్‌కు జేమ్స్ రాయ్ హార్నర్ సంగీతం సమకూర్చారు. అయితే, ఆయన మృతితో సహాయకుడిగా పని చేసిన సైమన్ ఫ్రాంగ్లెన్ అవతార్ 2 కి సంగీతం అందించారు. ఇంగ్లిష్‌తో పాటు మనదేశంలో హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్ 250 మిలియన్ డాలర్లు. ఇందులో తెలుగు రైట్స్ వంద కోట్లకుపైగానే ఉందని సమాచారం.
also read news:
bread rice : నోరూరించే బ్రెడ్ రైస్ తయారు చేయండి ఇలా