Avatar 2: 13 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ అనే విజువల్ వండర్ .. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కి అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించి ఎన్నో సంచలనాలు సృష్టించింది.. ఇక ఇన్నేళ్లకుఈ చిత్రానికి కొనసాగింపుగా అవతార్ 2 వచ్చింది. ద వే ఆఫ్ వాటర్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు,ఇంగ్లిష్ తో పాటు 160 కి పైగా భాషల్లో రిలీజ్ అయ్యింది. లెజండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
అవతార్ మొదటి పార్ట్ పండారా గ్రహంలో తెరకెక్కించగా రెండో భాగం సముద్ర గర్భంలో తీయడం జరిగింది. పూర్తిగా నావి మనిషిలా మారిన జేక్.. తన కుటుంబంతో కలిసి వేరే చోటుకు వలసగా వెళ్తాడు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుంటూ, ఆ తెగలో మనుషుల్లా కలిసిపోయి బతుకుంతాటాడు. అయితే పండోరాలో స్కై మేన్ భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చినట్లే, ఇక్కడ కూడా నీటిలో ఉన్న అపూర్వ సంపదని చేజిక్కుంచుకోవాలని ఓ సంస్థ ప్రయత్నాలు చేస్తూ ఉంఉటంది.. ఈ క్రమంలోనే మన హీరో జేక్ సల్లీతో పాటు వాళ్ల తర్వాత జనరేషన్ కూడా తమపై అధికారం చెలాయించాలని చూసిన మనుషులపై ఎలా ఎదురు తిరిగారు. వారు తమ భూమిని ఎలా కాపాడుకున్నారు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
పర్‌ఫార్మెన్స్:
3 గంటల కంటే ఎక్కువ నిడివితో, ఎడతెరిపి లేని విజువల్ ఫీస్ట్ తో, ఫ్రేమ్ రేట్‌తో అతి సృజనాత్మకంగా సినిమాని తెరకెక్కించాడు జేమ్స్ కామెరూన్. బలమైన భావోద్వేగంతో కూడిన ‘అవతార్’ మొదటి కథ కంటే మెరుగైన, సంక్లిష్టమైన కథ ఇది కాగా, పాత్రలు కొంచెం ఎక్కువగా వున్నాయి. అయినా త్రీడీలో అత్యుత్తమ, అద్భుత విజువల్స్ తో, టెక్నిక్స్ తో దృశ్యవైభవంగా ఈ చిత్రం మంత్ర ముగ్ధులని చేస్తుంది. ఇక పాత్రలు కూడా ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
కేట్ విన్స్‌లెట్, విన్ డిజీల్, స్టెఫాన్ వార్తింగ్టన్, జో సల్ానా, సామ్ వర్తింగ్టన్ వంటి నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇచ్చిన పాత్రలకు కళ్లకు కట్టినట్టే చూపించి ప్రేక్షకులకి వినోదం పంచారు.
ప్లస్ పాయింట్స్ :
విజువల్స్
సంక్లిష్టమైన కథ
జేమ్స్ కామెరూన్ డైరెక్షన్
మైనస్ పాయింట్స్:
సినిమా లెంగ్త్
ఫస్టాఫ్
చివరిగా..
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు, నిర్మాత జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో రూపొందిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రంలో కేట్ విన్స్‌లెట్, విన్ డిజీల్, స్టెఫాన్ వార్తింగ్టన్, జో సల్ానా, సామ్ వర్తింగ్టన్ తదితరులు నటించారు. కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులని సరికొత్త లోకానికి తీసుకెళుతున్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా కామెరూన్ చిత్రీకరించాడు. ఈ చిత్రం 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. తొలి రోజు ఈ చిత్రం సంచలనాలు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదైతేనేం జేమ్స్ కామెరూన్ మరోసారి విజువల్ వండర్ క్రియేట్ చేయగా, మనల్నిందరిని మరో మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లి ఆనందింపజేసారు.