Monday, May 13, 2024
Homeinternational"పార్లమెంట్‌ లోనే లైంగిక దాడికి గురయ్యాను" మహిళా సెనేటర్ సంచలన ఆరోపణలు

“పార్లమెంట్‌ లోనే లైంగిక దాడికి గురయ్యాను” మహిళా సెనేటర్ సంచలన ఆరోపణలు

Telugu Flash News

ఆస్ట్రేలియా పార్లమెంట్‌ లో ఓ చట్ట సభ్యురాలికి అవమానం జరిగింది. తోటి సభ్యుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా ఎంపీ లిడియా థోర్ప్ (Lidia Thorpe) సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంగా పేరొందిన ఈ పార్లమెంట్ భవనంలో మహిళలు విధులు నిర్వహించేందుకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సెనేట్‌లో ఆమె ఉద్విగ్న ప్రసంగం చేశారు.

స్వతంత్ర మహిళా సెనేటర్ పార్లమెంటులో ఒక శక్తివంతమైన వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సెనేటర్ డేవిడ్ వాన్ (David Van) తన పట్ల దారుణంగా ప్రవర్తించారని ఆమె అన్నారు. గురువారం సెనేట్‌లో ప్రసంగిస్తూ వేధింపులను వివరించారు. అతను నన్ను అనుసరించేవాడు. అభ్యంతరకరంగా తాకడం. శృంగార కార్యకలాపాలకు ప్రతిపాదనలు చేసేవారు. దీంతో ఆఫీస్ రూమ్ నుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉంది. కొంచెం డోర్ తెరిచి అతను బయట లేడని నిర్ధారించుకున్న తర్వాతే వచ్చేదాన్ని అని చెప్పింది.

పార్లమెంటు ఆవరణలో నడవాల్సి వచ్చినప్పుడు నాతో పాటు ఎవరైనా ఉండేలా చూసుకున్నాను . నాలాగే మరికొందరు కూడా ఇలాంటి వేధింపులకు గురవుతున్నారని నాకు తెలుసు. అయితే కెరీర్ పోతుందనే భయంతో బయటకు రాలేదు. ఈ భవనం మహిళలకు సురక్షితమైన స్థలం కాదు’ అని కన్నీళ్లు పెట్టుకుంది. పార్లమెంట్ నిబంధనల మేరకే కేసు పెడతామన్నారు. అయితే, ఈ ఆరోపణలను డేవిన్ వాన్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు.

అయితే ఆస్ట్రేలియా పార్లమెంటులో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఓ మహిళ తనపై పార్లమెంటులో అత్యాచారం చేశారని ఆరోపించారు. మార్చి 2019లో, పార్లమెంటులోని అప్పటి రక్షణ మంత్రి లిండా రెనాల్డ్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ సిబ్బంది ఆమెను సమావేశానికి పిలిచి, ఆమెపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో అప్పటి ప్రధాని స్కాట్ మారిసన్ దిగ్భ్రాంతి చెంది బాధిత మహిళకు క్షమాపణలు చెప్పారు.

read more news :

Cyclone Biparjoy : గుజరాత్ కు పెను ముప్పు.. కచ్, సౌరాష్ట్ర తీరాలకు రెడ్ అలర్ట్ జారీ

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News