మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసింది. రెండేళ్ల తర్వాత అర్జున్‌కు తుది జట్టులో అవకాశం కల్పించింది ముంబై మేనేజ్‌మెంట్. ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్.. తొలుత కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసిన ముంబై.. ఢిల్లీపై మూడో మ్యాచ్‌లో గెలిచి జోష్ మీద ఉంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గత మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఓడింది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ జట్టు.. ఓపెనర్లు నిరుత్సాహ పరిచారు. అయితే, యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో కేకేఆర్ 20 ఓవర్లకు గానూ ఆరు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్‌కు ఇది మేడిన్ ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం.
అయితే, సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ముంబైని గెలవాలంటే కాస్త కష్టతరమైన అంశమే. అర్జున్ టెండూల్కర్‌కు తొలి ఓవర్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. అయితే, అర్జున్‌కు రెండు ఓవర్లే ఇవ్వడం గమనార్హం. రెండు ఓవర్లు వేసిన అతడు.. 17 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లేమీ తీయలేకపోయాడు. 8.50 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. అయితే, భవిష్యత్‌లో టీమిండియాలో ఆడేందుకు ఓ మార్గం వేసుకోవాల్సిన అవసరం ఉందని సచిన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐపీఎల్‌లో రాణించడం ద్వారా చాలా మంది క్రికెటర్లు టీమిండియాలో చోటు దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ముంబై జట్టుకు సచిన్ గతంలో అద్భుత విజయాలను అందించాడు. ఇప్పుడు తన కుమారుడు ఏ మేరకు రాణిస్తాడోనని అందరూ ఎదురు చూస్తున్నారు. అర్జున్ టెండూల్కర్‌ను రెండేళ్ల కిందటే ముంబై వేలంలో కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు అవకాశాలు రాలేదు. ఇదే అతడికి తొలి మ్యాచ్. ఆల్ రౌండర్ అయిన అర్జున్ దేశ వాలీ క్రికెట్‌లో గోవా తరఫున ఆడాడు. ఇప్పటి వరకు ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, ఏడు లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక తండ్రి, తనయుడు ఒకే జట్టుకు ఐపీఎల్‌లో ఆడటం ఇదే ప్రథమం. అర్జున్‌కు పలువురు మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు, బెస్ట్ ఆఫ్ లక్‌లు చెప్పారు.
also read :
Japan PM: జపాన్ రాజకీయాల్లో కలవరం.. ప్రధానిపై బాంబు దాడి..
Kejriwal: దేశం కోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధం.. బీజేపీ నేతలకు అహంకారం పెరిగిందన్న కేజ్రీవాల్