Homebigg boss telugu season 6Bigg Boss telugu 6: తొలిసారి బిగ్ బాస్‌కి మ‌హిళా కెప్టెన్.. వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా అర్జున్

Bigg Boss telugu 6: తొలిసారి బిగ్ బాస్‌కి మ‌హిళా కెప్టెన్.. వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా అర్జున్

Telugu Flash News

Bigg Boss telugu 6: బిగ్ బాస్ ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ షోలో రోజురోజుకి ఆస‌క్త‌క‌ర విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఫ్రెండ్స్‌గా ఉన్న వాళ్లు శ‌త్రువులుగా మారుతున్నారు. తాజా ఎపిసోడ్‌లో మొన్న‌టి వ‌ర‌కు క‌లిసి ఉన్న ఆదిరెడ్డి, రేవంత్ మధ్య చిన్న గొడవ ప‌డ్డట్టు క‌నిపించింది.

ఇక ఫైమా త‌న కామెడీతో సంద‌డి చేయ‌గా, నువ్వు చేసిన పనికి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ? నువ్వు చేసిన పని అంతా చూసేసి నాకు పెళ్లి కాకుంటే ఎవరిడి భాద్యత అంటూ రాజ్‌తో ఆటాడుకుంది ఫైమా. ఇక బిగ్ బాస్ ‘పంచ్ పడితే’ టాస్క్ ని తిరిగి ప్రారంభించ‌గా, ఈ టాస్క్ పూర్తయ్యే సరికి కెప్టెన్సీ పోటీలో కీర్తి, సుదీప, శ్రీ సత్య ఈ ముగ్గురు నిలుస్తారు.

పాపం అర్జున్..

లెవ‌ల్ 2లో కెప్టెన్ అనే ఆంగ్ల అక్షరాలని ఒక్కొక్కటి తీసుకువచ్చి హుక్స్ కి తగిలించాలి అని బిగ్ బాస్ చెప్పారు. అయితే అక్షరాలని తీసుకుని వెళ్లేసమయంలో బిగ్ బాస్ ఇచ్చిన ప్యాడ్స్ పైనే నడవాల్సి ఉంటుంది.

ప్యాడ్స్ ని ముందుకు జరుపుకుంటూ గమ్యం చేరుకొని అక్షరాలని అమర్చి కెప్టెన్ అనే పదం తయారు చేయాలి అని బిగ్ బాస్ తెలియ‌జేయ‌గా, ఆ టాస్క్‌ని కీర్తి విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. దీంతో ఆమె బిగ్ బాస్ కొత్త కెప్టెన్‌గా నిలిచింది. తొలివారం బాలాదిత్య, రెండోవారం రాజ్, మూడో వారం ఆదిరెడ్డిలు కెప్టెన్ కాగా, నాలుగోవారం కీర్తి కెప్టెన్ కావ‌డం విశేషం.

ఇక ఈ వారం వరెస్ట్ పెర్ఫామర్ ఎవరో తేల్చే సమయం రాగా, వరస్ట్ పెర్ఫామెన్స్ ప్రాసెస్‌లో ఏడుగురు సభ్యులు అర్జున్ కళ్యాణ్‌కి ఓట్లు వేసి అతన్ని జైలుకి పంపారు. గ‌త వారం జైలుకి వెళ్లిన అర్జున ఈ వారం కూడా మ‌ళ్లీ జైలుకి వెళ్ల‌డం విశేషం .చూస్తుంటే మనోడు ఈ వారం త‌ట్టా బుట్టా స‌ర్ధుకొని హౌజ్ నుండి బ‌య‌ట‌కు వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది.

అయితే శ్రీస‌త్య‌.. అసలు నువ్ బిగ్ బాస్‌కి ఎందుకు వచ్చావ్ అర్జున్.. నా కోసం వచ్చావా? టైటిల్ గెలవడానికి వచ్చావా? అంటే స‌న్న‌గా న‌వ్వుతూ బిగ్ బాస్ కోస‌మే అని బ‌ల‌వంతంగా చెప్పాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News