అర్చన గౌతమ్ (Archana Gautam) బిగ్ బాస్ ద్వారా బాలీవుడ్ నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఖత్రోన్ కే ఖిలాడీ (Khatron Ke Khiladi) షో లో అర్చన నటిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టి పెరిగిన ఆమె ఉద్యోగం కోసం ముంబైకి వలస వచ్చింది. సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా ఆమె చాలా షాకింగ్ కామెంట్స్ చేసింది.
ముంబైలో పీజీ చదువుతున్న సమయంలో తనకు సినీ పరిశ్రమకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడిందని తెలిపింది. సినిమాలపై తనకున్న ఇష్టాన్ని గుర్తించిన తను ఆడిషన్స్‌కు వెళ్లాలనుకుంటున్నావా అని అడిగిందని చెప్పింది.
అయితే ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు, షార్ట్‌లు ధరించాలని ఆ మహిళ సలహా ఇచ్చింది. టాప్ కూడా చిన్నగా ఉంటే కచ్చితంగా సెలెక్ట్ అవుతానని, నిర్మాతలకు అలా అయితేనే నచ్చుతుందని చెప్పడంతో కాస్త ఇబ్బందిగా అనిపించిందని అర్చన తెలిపింది.
తాను చెప్పింది ఆశ్చర్యంగా ఉన్నా కూడా , తర్వాత అదే నిజమని తర్వాత తెలిసిందని చెప్పింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొందరు కొత్త మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులను తెలుసుకుని రోజుకు మూడు వేలతో ప్రయాణం ప్రారంభించానని అర్చన గౌతమ్ చెప్పింది.
read more :
Ram Charan Daughter : రామ్ చరణ్ కుమార్తె రాశి, జన్మ నక్షత్రం ఏంటో తెలుసా? ఇప్పుడిదే వైరల్ న్యూస్!