Telugu Flash News

AP Weather : రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు 🌧️

ap weather

ap weather

AP Weather : గత కొద్ది రోజులుగా భానుడి వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఇచ్చింది . నైరుతి రుతుపవనాలు (monsoon) ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడు తీరాలను తాకాయని, తాజాగా ఈరోజు మధ్యాహ్నం ఏపీలోకి ప్రవేశించాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటతో పాటు సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తమిళనాడులోని శ్రీహరికోట, కర్ణాటక, ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్‌ తదితర ప్రాంతాల్లోని ఉత్తర కొనపై ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి గాలులు వ్యాపించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జాయ్ తుపాను రానున్న 24 గంటల్లో మరింత బలపడుతుందని ఐఎండీ వెల్లడించింది. దీంతో గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో పోర్ బందర్ తీరానికి దగ్గరగా 460 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది ద్వారకా తీరానికి నైరుతి దిశలో 600 కిలోమీటర్ల దూరంలో ఉందని IMD వెల్లడించింది. దీంతో రానున్న ఐదు రోజుల్లో సౌరాష్ట్ర-కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీవ్ర తుపాను ప్రభావంతో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ తీరంలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

also read :

Karnataka News : పెళ్లయిన రెండో రోజే భర్తపై వేధింపుల కేసు 😮

digital payments rankings : 2022 సంవత్సరానికి డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం📲👏

Exit mobile version