ఏపీ సీఎం జగన్ (AP CM JAGAN) టీడీపీ నియోజకవర్గాలపై దూకుడు పెంచారు.ఏ నియోజకవర్గంలో ఎవరు బాధ్యతలు నిర్వహించాలీ అన్న దానిపై ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే టీడీపీ నుంచి వైసీపీకి కొంత కాలంగా దగ్గరైన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో నెలకొన్న సస్పెన్స్ కి క్లారిటీ ఇచ్చే దిశగా చర్చలు జరుపుతున్నారు.
గన్నవరంలో వల్లభనేని వంశీ తానే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధినని ప్రకటించుకోగా.. వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలు కూడా ఈ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ విషయంపై చర్చించబోతున్నట్టు సమాచారం.
ఈ సమయంలోనే హిందూపురంలోనూ తమ నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తుండగా.. హిందూపురం టీడీపీకి కంచుకోటగా వ్యవహరిస్తుంది. అక్కడ వైసీపీ నేతల మధ్య సమన్వయం ఉన్నట్టు కనిపించట్లేదు.
మంత్రి పెద్దిరెడ్డి పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా నేతల మధ్య ఉన్న విభేదాలు బయట పడ్డాయట. ఈ తరుణంలోనే హిందూపురం, ఉరవకొండ,పెనుకొండ నియోజకవర్గాలలో ఎవరు బాధ్యతలు వహిస్తారా…అన్న విషయంపై సంక్రాంతి లోగా పార్టీ ఒక అంచనాకు వచ్చేటట్టు కనిపిస్తుంది.
పర్చూరు బాధ్యతలు ఆమంచి కే…
2019 లో జరిగిన ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమంచి ఓడిపోగా..ఆయన పైన టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ నేత కరణం బలరాం గెలుపొందారు.
అలా విజయాన్ని తన సొంతం చేసుకున్న బలరాం తన కుమారుడితో కలిసి వైసీపీకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గంలో సీటు కరణం బలరాంకి ఇస్తారా… లేక ఆమంచికి ఇస్తారా… అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది.
ఈ తరుణంలో ఈ విషయం గురించి ఆమంచితో పార్టీ నాయకత్వం మాట్లాడగా.. చీరాలను కరణంకు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆమంచి కూడా అంగీకరించగా…ఆమంచికి పర్చూరు బాధ్యతలు అప్పగించారు.
అయితే పర్చూరు బాధ్యతలు ఎవరికి అప్పగించాలా…అని కొంత కాలంగా చర్చలు జరిగి, కొంత మంది నేతల పేర్లు చర్చల్లోకి రాగా…చివరికి పర్చూరు బాధ్యతలు ఆమంచికే అప్పగించారు.
అయితే 2019 ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేసిన వై.సీ.పీ అభ్యర్థి వెంకటేశ్వర రావు ఓటమిని చవి చూసారు. ఆ తరువాత నుంచి వై.సీ.పీకి దూరంగా ఉంటున్నారు. దీంతో,పర్చూరు ఇంఛార్జ్ గా ఆమంచిని నియమించాలని నిర్ణయించుకున్న పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
వెంకటగిరి రాం కుమార్ రెడ్డి చెంతకి…
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం చాలా కాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తుండగా ఊరుకున్న జగన్ సమయం చూసి గుణపాఠం చెప్పారు. మొదట్లో పార్టీ వ్యవహారాలపై, అధికారులపై వ్యాఖ్యలు చేసిన ఆనం,ఇటీవలే నేరుగా ప్రభుత్వం పైనే కామెంట్స్ చేయడం ప్రారంభించారు.
కాగా ఇదివరుకే ఈ రకమైన వ్యాఖ్యలపై ఆనం ను హెచ్చరించినట్లు తెలుస్తుండగా…ఇప్పుడు సంక్షేమ పథకాలే ఆయుధాలుగా సాగుతున్న తరుణంలో, సొంత పార్టీ ఎమ్మెల్యేనే వాటి గురించి వ్యతిరేకంగా మాట్లాడడంతో వైసీపీ ఆ వ్యాఖ్యల గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టింది.
ఇక్కడ ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతోందని, అదేకనక జరిగితే ఏడాదికి ముందే పార్టీ ఇంటికి వెళ్లటం ఖాయం అంటూ ఆనం చేసిన వ్యాఖ్యలను హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది.
ఆనం మరో పార్టీతో టచ్ లో ఉన్నారనీ, అందుకే ఇలా మాట్లాడుతున్నారనీ బయట ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో,తన వ్యాఖ్యలతో సంచలనంగా మారిన కోటంరెడ్డితో సీఎం జగన్ చర్చించగా.. ఆనంతో అవసరం లేదని అనుకున్నట్లు తెలుస్తుంది.
ఇందువల్లనే ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను నేదురుమల్లి రాం కుమార్ రెడ్డికి అప్పగించారు.
also read :
India: టీమిండియాలా లేదు.. గుజరాత్ జట్టులా ఉంది.. జట్టు ఎంపికపై నెటిజన్స్ ట్రోల్స్
weight loss tips in telugu : తొందరగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి ?
Pakistan Crisis : పాక్‌కు అప్పుల కష్టాలు.. విద్యుత్ ఆదా కోసం వినూత్న నిర్ణయాలు!