Homecinemaపెళ్లి పీట‌లెక్క‌బోతున్న నేహా చౌద‌రి.. వ‌రుడు వివ‌రాలు ఇవే!

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న నేహా చౌద‌రి.. వ‌రుడు వివ‌రాలు ఇవే!

Telugu Flash News

Anchor: ప్ర‌స్తుతం తెలుగు ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది యాంక‌ర్స్ త‌మ అంద‌చందాల‌తో పాటు టాలెంట్‌తో స‌త్తా చాటుతున్నారు. అలాంటి వారిలో నేహా చౌద‌రి కూడా ఒక‌రు. తిరుపతిలో జన్మించిన నేహా… కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి ఒక ఆరు నెల‌ల పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ చేయడం జరిగింది. ఉన్నత కుటుంబంలో జన్మించిన గాని ప్రారంభంలో వ్యాపారాలు నష్టం రావడంతో నేహా చౌదరి మధ్య తరగతి జీవితాన్ని గ‌డిపింది. ప్రముఖ న్యూస్ ఛానల్ మహా న్యూస్ లో యాంకర్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం సాక్షి, హెచ్ఎంటీవీ, ఎన్టీవీ, వనిత టివి, మా మ్యూజిక్ వంటి చోట్ల ప‌ని చేసింది.

2019 సైమా అవార్డ్స్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించిన నేహా ఆ త‌ర్వాత ప్రో కబడ్డీ, ఐపీఎల్, ఐసీసీ వరల్డ్ కప్ వంటి స్టార్ స్పోర్ట్స్ ఈవెంట్ కి కూడా హోస్ట్‌గా ప‌ని చేసింది. అయితే బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా సంద‌డి చేసిన నేహా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. ఈ అమ్మ‌డు సైలెంట్‌గా గుడ్ న్యూస్ చెప్పింది. ‘ఐ సేడ్ ఎస్’ అంటూ యూట్యూబ్ కి సంబంధించిన లింక్ ని జతచేస్తూ ఇందులో ‘నా పెళ్లి గోల మొదలైంది’ అంటూ ఒక వీడియో చేసి తన కాబోయే వరుడుని రివీల్ చేసింది. ఇంజనీరింగ్ క్లాస్ మేట్ అయిన తన స్నేహితుడినే వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పిన నేహ‌.. గ‌త 13 ఏళ్ళ నుంచి అత‌నితో ప్రేమ‌లో ఉన్న‌ట్టు తెలియ‌జేసింది. ఇక ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనుంద‌ట‌.

త‌న‌కి కాబోయే భ‌ర్త పేరు ఆయన పేరు అనిల్‌ అని, జర్మనీలో సెటిల్డ్ అయ్యాడని, పెళ్లి మాత్రం ఇండియాలోనే చేసుకుంటామని, తాను కమిట్‌ అయిన ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకుని ఏడాది తర్వాత తాను కూడా జర్మనీ వెళ్లిపోతానని నేహా తెలియ‌జేసింది. వీడియో కాల్‌ ద్వారా తనకు కాబోయే వాడిని ఫ్రెండ్స్ కి కూడా పరిచయం చేసింది నేహా చౌదరి. ప్రస్తుతం డేట్‌కి సంబంధించిన చర్చలు జరుగుతుండ‌గా, , అతి త్వరలోనే మ్యారేజ్‌ ఉంటుందని నేహా చౌద‌రి క్లారిటీ ఇచ్చింది.

also read news:

సంపూర్ణ ఆరోగ్యానికి ఆయుర్వేద వైద్య చిట్కాలు

UKలో చదువుకుంటూ స్టూడెంట్స్ జాబ్ సెర్చ్ చేయడం ఎలా.. ఒక భారత విద్యార్థి ప్రత్యేక వ్యాసం ఇదిగో!!

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News