HomecinemaAnasuya:మీకు ధైర్యం ఉంటే, ఉప్పు కారం తింటే... అనసూయ ఏంది ఇలా రెచ్చిపోతుంది..!

Anasuya:మీకు ధైర్యం ఉంటే, ఉప్పు కారం తింటే… అనసూయ ఏంది ఇలా రెచ్చిపోతుంది..!

Telugu Flash News

Anasuya: అందాల యాంక‌ర‌మ్మ అన‌సూయ ఇటీవ‌ల వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారుతుంది. ఖుషి చిత్ర పోస్టర్స్ లో ది విజయ్ దేవరకొండ అని రాసిన నేపథ్యంలో అన‌సూయ పరోక్షంగా సెటైర్స్ వేయ‌డంతో వివాదం రాజుకుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయ‌డం ఆమె ధీటుగా స్పందిస్తుండ‌డం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఆమె ఒక వీడియో బైట్ విడుద‌ల చేస్తూ అందులో యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

సెలబ్రిటీల మీద వార్తలు రాసి కడుపు నింపుకునే మీకు ధైర్యం ఉంటే, ఉప్పు కారం తింటుంటే నిజాలు రాసి చూపించండి. నేను నిజం మాట్లాడాను . నా అభిప్రాయం తెలియజేశాను. ఫలానా హీరో ఫ్యాన్స్ అనసూయను వేధించారు, ట్రోల్ చేశారు, వెంటబడ్డారు ఇలాంటివి కాదు. అస‌లు మీకు దునియా దారి అర్థం కావడం లేదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అన్నవాడి నోరే కంపు. చేతకాని వాళ్ళు అదుపు తప్పారు. ఇది మీరు పెట్టాల్సిన థంబ్ నెయిల్. బెటర్ లక్ నెక్స్ట్ టైం, అంటూ వీడియోలో ఘాటుగా స్పందించింది అన‌సూయ‌. వీడియోలో అన‌సూయ‌ మీడియా సంస్థలను, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని సైతం ఏకి పారేసింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News