HomehealthAmla: ఉసిరి జ్ఞాప‌క శ‌క్తిని పెంచుతుంద‌న్న విష‌యం తెలుసా?

Amla: ఉసిరి జ్ఞాప‌క శ‌క్తిని పెంచుతుంద‌న్న విష‌యం తెలుసా?

Telugu Flash News

Amla: మ‌న‌కు విరివిగా దొరికే వాటిలో ఉసిరి కూడా ఒక‌టి. దీనిని సంస్కృతంలో ఆమ్లా , ధాత్రిఫలం అని పిలుస్తారు. ఉసిరి చెట్టు లో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. కాబ‌ట్టి దీనిని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్నా మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది.

ఇందులో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి కాబ‌ట్టి వీటిని త‌ర‌చు తీసుకోవ‌డం మంచిది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధంగా కూడా దీనిని చెప్ప‌వచ్చు.

మంచి మందు

భోజనం చేసాక ఉసిరిని తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించ‌డ‌మే కాక రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నియంత్రిస్తుంది.

పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీళ్ళలో కలుపుకొని తగ్గితే ద‌గ్గు నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌డమే కాక అలర్జీ, ఆస్తమా , టీవీ, ధీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్స్ పోతాయి. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తేనెలో కలిపి తీసుకున్నా మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఇది జ్ఞాప‌క‌శ‌క్తిని కూడా పెంచుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులని కూడా త‌గ్గిస్తుంది.. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా ఉంటూ మ‌న చ‌ర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి.

ఉసిరి మ‌న ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఉసిరిని ఒక క్ర‌మ ప‌ద్ద‌తిలో తీసుకుంటే చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News