Allu Arjun: గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారాడు. ఆయన క్రేజ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే చెన్నైకి చెందిన ఎంటర్ టైన్ మెంట్ వెబ్‌సైట్ బిహైండ్‌వుడ్స్ ఈ మద్య ఓ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ కి అవార్డులు ప్రధానం చేశారు.
‘గోల్డెన్ ఐకాన్ ఆప్ ఇండియన్ సినిమా’ అవార్డు సొంతం చేసుకున్న బన్నీకి నిర్వాహకులు ఓ సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అల్లు అర్జున్ చిన్ననాటి స్కూల్ టీచర్ స్టేజ్ పైకి ప్రవేశ పెట్టగానే ఆమెని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆమె పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నాడు ఈమె పేరు అంబికా కృష్ణన్.. మూడో తరగతిలో నాకు పాఠాలు చెప్పిన టీచర్. 30 ఏళ్ల తర్వాత మళ్లీ మేడమ్ ని కలిసాను.. ఈ మేడమ్ నాకు స్పెషల్. సరిగ్గా చదవకపోయిన కూడా ఏ రోజు తిట్టలేదు.. ఆ సమయంలో నీకు ఉన్న ప్రతిభ నిరూపించుకుంటే.. ఉన్నతశిఖరాలకు ఎదుగుతావు అంటూ ఎంతో ప్రోత్సహించే వారని చెప్పారంటూ బన్నీ ఎమోషనల్‌గా మాట్లాడాడు.