Akshay Kumar: ఇటీవలి కాలంలో సినిమా సెట్స్ లో తరచు ప్రమాదాలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి ఈ ప్రమాదంలో స్టార్స్ కూడా గాయలపాలవుతున్నారు. అయితే తాజాగా అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేసిన వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్ సినిమా షూటింగ్ లో ఊహించని ప్రమాదం జరిగింది.
చిత్రంలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీమహారాజ్ పాత్రలో కనిపించబోతున్నారు. కొల్హాపూర్‌లో గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపకుంటుండగా, సెట్లో జరిగిన ప్రమాదం కారణంగా ఈమూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది.
ప్రమాదంలో ఒక యువకుడి పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదవశాత్తు యువకుడు లోయలో పడిపోవడంతో అంతా ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. 19 ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు వంద అడుగులు ఎత్తు నుంచి లోయలో పడిపోయాడు. దాంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.అయితే ఫొటోగ్రఫీ చేస్తున్న సమయంలో నగేశ్ ఖోబారే అనే యువకుడు కాలు జారి నేరుగా లోతైన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. యువకుడికి జరిగిన ప్రమాదం వలన షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ పడింది.
also read :
Viral Video: అమ్మాయిలూ.. బైక్‌పై ఇలాంటి ఫీట్లు అవసరమా? తృటిలో తప్పిన ప్రమాదం..