Adipurush Telugu Movie Review
ఆదిపురుష్ కథ:
దశరథ మహారాజు తన వృద్ధాప్యంలో రాజ్యం నుండి విముక్తి పొంది, తన పెద్ద కొడుకు రాముడిని (ప్రభాస్) అయోధ్య నగరానికి రాజుగా పట్టాభిషేకం చేయాలని కోరుకుంటాడు. కానీ దశరథ మహారాజు రెండవ భార్య కైకేయి రాఘవకు బదులుగా తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలని పట్టుబట్టింది. అంతే కాదు భరతుని పట్టాభిషేకంతో పాటు రాముడిని 14 సంవత్సరాలు వనవాసం చేయమని కోరుతుంది. తండ్రి ఆజ్ఞ ప్రకారం, రాముడు అతని భార్య సీత (కృతి సనన్) మరియు లక్ష్మణుడి తో సహా వనవాసానికి బయలుదేరుతాడు.
వనవాసంలో ఉన్న రోజుల్లో రావణుడి చెల్లి శూర్పణఖ లక్ష్మణుడిని ఇష్టపడుతుంది. కానీ లక్ష్మణుడికి అది నచ్చకపోవడంతో శూర్పణఖ తన రాక్షస సైన్యంతో దాడి చేసింది, ఈ దాడిలో సీత గాయపడుతుంది. దాంతో కోపోద్రిక్తుడైన లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కొస్తాడు. అతను వెళ్లి తన అన్నయ్య రావణుడి (సైఫ్ అలీఖాన్)కి ఈ విషయం చెప్పడంతో, రావణుడు ఆగ్రహానికి గురవుతాడు మరియు సన్యాసి రూపంలో వచ్చి సీతని అపహరించి లంకకు తీసుకెళ్లి అశోక వనం లో బంధిస్తాడు. అపుడు రాముడు రావణాసురుడిని ఎలా ఓడించి సీతను తీసుకొచ్చాడు..?, అందుకు వానరసైన్యం ఎలాంటి సహాయం చేశాడో వెండితెరపై చూడాలి.
ఆదిపురుష్ విశ్లేషణ:
సినిమా ప్రారంభంలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు యానిమేటెడ్ శ్రీ మహా విష్ణు విజువల్స్ అద్భుతంగా అనిపించాయి. ఇక ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. విజువల్స్ గ్రాండ్ గా, అద్భుతంగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత వచ్చిన ‘రామ్ సీతా రామ్’ పాటలో రావణాసురుడు సీతను అపహరించే సీన్ చాలా బాగా కుదిరింది.
ఈ సన్నివేశాలన్నింటికీ విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా వచ్చాయి. కానీ మిగిలిన సన్నివేశాలకు వీఎఫ్‌ఎక్స్ చాలా పేలవంగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే మంచి డ్రామా, కానీ వీఎఫ్‌ఎక్స్, పైన పేర్కొన్న సీన్స్ మినహా మిగిలినవి చాలా బ్యాడ్‌గా అనిపిస్తాయి. రామాయణం గురించి చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరికీ తెలుసు, మళ్లీ అదే కథతో తీస్తున్నారు, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండాలి, అప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు, అదే ఈ సినిమాలో మిస్ అయింది.
అయితే డ్రామా పండినందున కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. ఇక సెకండాఫ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది కానీ ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ చూసి ప్రేక్షకులకు పిచెక్కుతుంది. ముఖ్యంగా రావణాసురుని పది తలలు చూపించిన తీరు గురించి చెప్పుకోవడానికి మాటలు లేవు.. ఇప్పటి వరకు ఏ దర్శకుడు రావణాసురుడిని ఇంత నీచంగా చూపించలేదు.
అసలు దర్శకుడు ఓం రౌత్ రావణుడిని అలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో అర్థం కాలేదు. అంతే కాదు ఈ సినిమాలో రాముడిని రాఘవ అని, సీతను జానకి అని, రావణాసురుడిని లంకేష్ అని ఎందుకు పిలిచారో అర్థం కావడం లేదు. ప్రభాస్ లుక్స్ ఫర్వాలేదనిపించినా, నటన పరంగా మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. కానీ క్లోజ్-అప్ షాట్స్‌లో అతని లుక్స్ చాలా చెత్తగా ఉన్నాయి మరియు డబ్బింగ్ సరిగ్గా చేయలేదు. ఇక ఈ సినిమా లో కృతి సనన్ సీతగా జీవించేసింది , సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో పర్వలేదనిపించారు.
ఫైనల్ టచ్ :
వీఎఫ్‌ఎక్స్‌పై పెద్దగా అంచనాలు లేకపోయినా సినిమా పరంగా అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. మరి బాక్సాఫీస్ పరంగా ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.
రేటింగ్ : 3/5
comedian sudhakar : దేవుడా…! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్..!
ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అనసూయ బికినీ ట్రీట్
read more :
Hanuman Seat : ఆదిపురుష్ సినిమా హాల్ లో ఆంజనేయుడి సీటు చూశారా ?
horoscope today 16 June 2023 ఈ రోజు రాశి ఫలాలు