HomecinemaAdipurush : ఇంట్రెస్టింగ్.. ఆదిపురుష్ నుండి మ‌రో అప్‌డేట్.. ఆక‌ట్టుకుంటున్న సీత లుక్

Adipurush : ఇంట్రెస్టింగ్.. ఆదిపురుష్ నుండి మ‌రో అప్‌డేట్.. ఆక‌ట్టుకుంటున్న సీత లుక్

Telugu Flash News

Adipurush : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఆయ‌న సినిమాల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ మరి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

జూన్ 16,2023న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో విలన్ రావణబ్రహ్మపాత్రలో సైఫ్ అలీ ఖాన్ న‌టించిన విష‌యం తెలిసిందే. శ్రీరామనవమి నుంచి ఈ మూవీకి సంబంధించి వ‌రుస అప్‌డేట్స్ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా సీత లుక్ లో కృతి సనన్ స్పెషల్ లుక్ ను రిలీజ్ చేసి అభిమానుల‌కి మంచి గిఫ్ట్ ఇచ్చింది.

రామ్ సీతా రామ్ అంటూ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో.. జానకిగా కృతీ సనన్ నారచీరలతో ఉన్న స్పెషల్ మోషన్ పోస్టర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేయ‌గా, ఇది సినీ ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. జానకి పాత్రలో కృతి సనన్ పోస్టర్ స్వచ్ఛత, దైవత్వం, ధైర్యం ఉట్టిపడేలా కనిపిస్తుంద‌ని అంటున్నారు.

ఇంత‌క‌ముందు ఆదిపురుష్ అప్‌డేట్స్‌పై కాస్త నిరాశ వ్య‌క్తం చేసిన మేక‌ర్స్ ఇటీవ‌ల వ‌చ్చిన అప్‌డేట్స్ పై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. సినిమాలో రాముడిగా ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నారు అనేది అంద‌రిలో ఓ ర‌క‌మైన ఎగ్జైట్మెంట్ ఉంది.

also read :

-Advertisement-

Gold Rates Today ((29-04-2023) : నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Agent: ఏజెంట్ సినిమా వెనుక ఇంత కుట్ర జ‌రిగిందా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News