HomecinemaAdipurush: ఆదిపురుష్ సినిమా రిలీజ్ చేయ‌కుండా ఉంటేనే బెట‌ర్‌.. లేదంటే..!

Adipurush: ఆదిపురుష్ సినిమా రిలీజ్ చేయ‌కుండా ఉంటేనే బెట‌ర్‌.. లేదంటే..!

Telugu Flash News

Adipurush: భారీ అంచ‌నాల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్‌. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. కొద్ది రోజుల క్రితం చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా, దానిపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.

రామాయణం పేరు చెప్పి బొమ్మల చిత్రం తీస్తున్నారంటూ.. ఇది రామాయణంలా ఉందా అంటూ దారుణంగా ట్రోల్స్ న‌డ‌వ‌డంతో సినిమా విడుద‌ల వాయిదా వేసి జూన్‌కి పోస్ట్ పోన్ చేశారు. కొన్నాళ్లుగా చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్ వ‌ర్క్ జ‌రుపుతున్నారు.

ఇక శ్రీరామ‌న‌వి సంద‌ర్భంగా పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా, దీనిపై విప‌రీత‌మైన ట్రోల్స్ వ‌స్తున్నాయి. కొత్త పోస్టర్​లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు పాత్ర‌లు ఉండ‌గా, సీతమ్మ తల్లి మెడలో తాళి, ఆభరణాలు లేకపోవడం, కాళ్లకు మెట్టెలు లేకపోవడం, లక్ష్మణుడికి పూర్తిగా గడ్డం ఉండటం చూసి జ‌నాలు ద‌ర్శ‌కుడిని తిట్టిపోస్తున్నారు.

ఇవ‌న్నీ చూసి ప్ర‌భాస్ అభిమానులే ఆ సినిమాని ఆపేయ‌మ‌ని గ‌గ్గోలు పెడుతున్నారు. చిత్రాన్ని రిలీజ్ చేసి ప్ర‌భాస్ ప‌రువు తీయోద్దంటూ కోరుతున్నారు. పోస్టర్ రియలిస్టిక్​గా లేదని మళ్లీ గ్రాఫిక్స్​ మాదిరిగానే ఉంద‌ని, దీనికంటే ఫ్యాన్స్ చేసిన పోస్టర్లే బాగున్నాయంటూ నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు..

also read :

Chakri: చ‌క్రీది స‌హ‌జ మ‌ర‌ణం కాదంటూ ఆయ‌న త‌మ్ముడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

-Advertisement-

IPL 2023: ఐపీఎల్‌లో ర‌చ్చ లేపిన సినీ స్టార్స్.. పీక్స్ లో బాల‌య్య కామెంట్రీ, ర‌ష్మిక, త‌మ‌న్నా ఊర‌మాస్ డ్యాన్స్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News