Bigg Boss 6 : బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ప్రస్తుతం ఆరో వారం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ చాలా రచ్చగా మారింది. ఒకరిపై ఒకరు అవాకులు, చెవాకులు పేల్చుకుంటూ హౌజ్ అంతా హీటెక్కిపోయేలా చేశారు.ఇక ఎలిమినేషన్స్ గురించి చర్చలు జరుగుతుండగా, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కా అని చెబుతాడు రేవంత్. అయితే సుదీప, కీర్తి ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయని జోస్యం చెప్పింది గీతూ. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌కి బాడీని ఛార్జింగ్ చేసుకుని రెట్టింపు ఎనర్జీతో గేమ్ ఆడాలనే టాస్క్ ఇచ్చారు. ఒక్కో ఆప్షన్ ప్రకారం కొంత శాతం బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతుంది. మరి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ హౌజ్ మేట్స్ ఇతరుల కోసం త్యాగాలు చేయాల్సి ఉంటుంది.
టాస్క్ ప్రారంభం కాగా, మొదట శ్రీహాన్‌ని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు బిగ్‌బాస్. అందులో మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి నాన్నతో వీడియో కాల్ మాట్లాడటం,అందుకే 35శాతం బ్యాటరీ తగ్గిపోతుందని, సిరితో ఆడియో కాల్ చేసినందుకు 30శాతం, ఇంటి ఫుడ్ తీనేందుకు 15 శాతం ఛార్జింగ్ తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు. ఇతరులు తన కన్నా బాధలో ఉన్నారని చెప్పిన శ్రీహాన్.. ఇంటి నుంచి వచ్చిన మటన్ బిర్యానీ ఆరగించాడు . అయితే సిరిని, ఫ్యామిలీని మిస్ అయినందుకు చాలా బాధపడ్డాడు
అనంతరం సుదీపకి అవకాశం వచ్చింది. ఆమెకి భర్తతో మాట్లాడే అవకాశం వినియోగించుకుంటే 30శాతం, భర్త పంపిన టీషర్ట్ పొందాలంటే 40శాతం, అమ్మ చేసిన చికెన్ కర్రీ పొందాలంటే 35శాతం బ్యాటరీ ఖర్చు అవుతుందని చెప్పగా, వీటిలో సుదీప భర్తతో ఆడియో కాల్‌కి ఒప్పుకుంది. ఇక ఆదిరెడ్డి వంతు రాగా, వీడియో కాల్ మాట్లాడేందుకు 40శాతం, భార్య ఆడియె కాల్‌కి30 శాతం పెట్టగా, కూతురు పంపిన టీషర్ట్ ధరించాలంటే 35శాతం బ్యాటరీ చెల్లించాల్సి వచ్చింది. ఎంతో ఆలోచించి కూతురు, భార్యతో మాట్లాడాడు. దీంతో 40 శాతం బ్యాటరీ తగ్గింది. కాల్ మాట్లాడాక ఆది రెడ్డి.. ‘మీరు నాతో మాట్లాడటంతో నాకు రెట్టింపు ఎనర్జీ వచ్చింది.. నువ్ హౌస్‌లోకి వస్తావ్.. అందరితో మాట్లాడతావ్.. మా నాన్నని చూసుకో.. నాగలక్ష్మి (చెల్లి)ని చూసుకో.. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే.. పాప బర్త్ డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయి.. నేను గేమ్ బాగా ఆడతాను అని ధీమాగా చెప్పాడు. వీడియో కాల్‌తో కవితను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న ఆది రెడ్డి, ఈ సీజన్‌లో తొలిసారి ఏడ్చాడు. కన్నీళ్లు అనేకంటే అవి ఆనందభాష్పాలు అనడం కరెక్ట్.